11/12/2012

ఆనంద క్షణం








నీ తలపులతో  
మొదలవుతుంది 
నా ప్రతి ప్రభాతం....
నీ నామ జపంతో  చేస్తాను
ప్రతి రాత్రి... స్వప్నలోక ప్రవేశం.

నన్నెందుకు 
అంతగా గుర్తు చేసుకుంటావు?
నీ పనుల్లో మునిగిపోవచ్చుగా?అంటావు....

నానుంచి నీ తలపులను 
కాసేపు పక్కన పెడదామనుకుంటా..
కానీ యింతలోనే,
చెప్పింది చేసేయడమేనా?
అంటూ, చిరుకోపంతో.... 
నా మనసులోకి తొంగి చూస్తావు.

నిన్ను మర్చిపోవాలనుకొనే 
సమయంలో  
మరీ ఎక్కువ   గుర్తొస్తావ్  సుమా!

దివారాత్రాలలో ...
తొలి, మలి సంధ్యలలో ...
నా స్మృతిపథంలో మెదలడం  సహజమే...
కాని తలపు- తలపుకీ  మధ్య కూడా 
తలపుల్లోకి  వచ్చేస్తే  ఎలా???
నాలోని నీ జ్ఞాపకాలకి 
దూరంగా ఉండడం  ఎలా???

బహుమతి పొందిన కవితను మీముందు ఉంచుతున్నాను...
గతంలో బ్లాగ్ లో పోస్ట్ చేసినదే...కొంతమంది మిత్రులు చదివి ఉండొచ్చు..
ఆనంద క్షణాలని మీతో పంచుకుంటున్నాను...@శ్రీ 

31 comments:

  1. ప్రేమను ప్రేమించు... ప్రేమకై -
    ప్రేమైక కవిత చాలా బాగుందండి.
    బహుమతి పొందినందుకు అభినందనలు.
    మీ కవితలన్నీ బహుమతి యోగ్యమైనవే. చాలా బాగుంటాయి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు భారతి గారూ!...
      మీ ప్రశంసకు...అభిమానానికి...@శ్రీ

      Delete
  2. Replies
    1. ధన్యవాదాలు మంజు గారూ!...మీ కు నచ్చినందుకు...@శ్రీ

      Delete
  3. కంగ్రాట్స్ శ్రీ గారు :-)
    పార్టీ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాం :)))

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు హర్షా...
      ఇండియా వచ్చినపుడు భోపాల్ వచ్చీ మరి...
      సైఫ్ ఆలీఖాన్ హోటల్ లో ఇస్తా...:-)...@శ్రీ

      Delete
  4. కాని తలపు- తలపుకీ మధ్య కూడా
    తలపుల్లోకి వచ్చేస్తే ఎలా???
    మరి మీరేం చేస్తున్నరేం??
    తడవ తడవకి
    ఇలా భావకవితాస్త్రాలు మాపై సంధిస్తే ఎలా..?
    శుభాభినందనలు..:)

    ReplyDelete
    Replies
    1. ధాత్రి గారూ!..
      అస్త్రాలకి ...ప్రతి శరాలు విసిరే మీకు భయమేల?
      మీ అభినందనలకు ధన్యవాదాలు...@శ్రీ

      Delete
  5. అభినందనలు ...అనతి కాలంలోనే మీరు అమూల్యమైన బహుమతిని అందుకున్నారు
    కృష్ణ,విష్ణుప్రియ,ప్రత్యూష,హర్షిత్

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు కృష్ణ..విష్ణు..ప్రత్యు...హర్షిత్లకు...@శ్రీ

      Delete
  6. Congratulations and Celebration! When is the E-party Sri gaaru?

    ReplyDelete
    Replies
    1. వెన్నెల గారూ!
      ఈ కవిత మీరు మొట్టమొదట కామెంట్ పెట్టిన కవిత...సో మీకు కూడా స్పెషల్ ధన్యవాదాలు చెప్పాలి...
      ఈ-పార్టీ ఇదిగో...మీకోసం...
      http://www.awesomecuisine.com/content_images/1/Diwali_Sweets.jpg

      మీ ఒక్క కామెంట్ మాత్రం ...ఉన్న ఈ లింక్ చూడండి...http://srikavitalu.blogspot.in/2012/04/blog-post_03.html

      Delete
    2. హా హా శ్రీ గారు. బలే ఇచ్చేసారుగా E-PARTY?
      Thank you so much శ్రీ గారు. And coongrats again.

      Delete
    3. :-)...ఇప్పటికి ఇలాగే సరిపెట్టుకోండి మరి...ధన్యవాదాలు మరో సారి...@శ్రీ

      Delete
  7. అభినందనలు శ్రీ గారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు జ్యోతి గారూ!...@శ్రీ

      Delete
  8. బావుంది..శ్రీ గారు . అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు వనజ గారూ!...@శ్రీ

      Delete
  9. Congratulations!!!!!!!!చాలా బాగుంది శ్రీ గారు....

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మీ ప్రశంసకు..అభినందనలకు కావ్య గారూ!...@శ్రీ

      Delete
  10. అభినందనలు శ్రీ గారు,,.మంచి మనసుతో మరన్ని ప్రేమ కవితలు రాసేయండి,ఈ సారి మొదటి బహుమతి తీసుకోవాలి మీరు,....సుమ ను ఇక్కడ చూసి కొంచెం అసూయగా వున్నా,..బహుమతి వచ్చింది కాబట్టి ఆనందంగా వుంది,...

    ReplyDelete
    Replies
    1. హహహ...ఈ సుమ మీ సుమ కాదండీ...
      ధన్యవాదాలు మీ అభినందనలకు...భాస్కర్ గారూ!...@శ్రీ

      Delete
  11. శ్రీ గారు, సుమ కోసం నేను మీ గ్రూప్ కి వచ్చేస్తున్నానండి,.

    ReplyDelete
    Replies
    1. స్వాగతం...వచ్చేయండి మరి...@శ్రీ

      Delete
  12. బహుమతి పొందినందుకు అభినందనలు "శ్రీ" గారు..
    మంచి మంచి కవితలతో బహుమతులందుకుని,
    మరెన్నో ఆనంద క్షణాలను మాతో పంచుకోవాలని కోరుకుంటున్నాము..

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రాజి గారూ!...మీ ప్రోత్సాహం మరిన్ని కవితలు వ్రాయిస్తుందని...మీతో ఆనదాలు పంచుకునేలా చేస్తుందని భావిస్తూ...@శ్రీ

      Delete
  13. Congratulations....Sree Garu

    FANTASTIC...KAVITANDII...CHAALAA CHAALAA BAAGUNDI...MAATALU LEVINKA !!!

    ReplyDelete
  14. ప్రియగారూ!
    మీకు కవిత నచ్చినందుకు...
    అంతగా మెచ్చినందుకు ధన్యవాదాలు...@శ్రీ

    ReplyDelete
  15. హృదయపూర్వక ధన్యవాదములు శ్రీ

    ReplyDelete