14/12/2012

అభినందనా?...నిందా?
నిన్ను చూడాలని ఉందో సారి
 
ఒకసారేనా?...ముమ్మాటికీ కాదు...
ఒకసారి చూసాక
 
మళ్ళీ మళ్ళీ నిన్ను చూసేలా
 
చూడాలని ఉంది.

తొలి సారి నిన్ను చూస్తూ
 
నిశ్చేష్టుడనై
చిత్త్తరువులా నిలిచిపోయా...
నోట మాట రాక
 

సంభ్రమాశ్చర్యాలలో మునిగి పోయా...


ఈ మనోజ్ఞ రూపమేనా...
నే స్వప్నాల్లో చూసేది?
ఈ మందస్మితమేనా
 
నను రేయింబవళ్ళు వెంటాడేది?
ఈ అందాన్నేనా
 
నేను కాంక్షించేది?
ఈ సోయగాన్నేనా
 
నా కన్నులు వెదికేది?

ప్రేయసిని ఊహిస్తే
 
ప్రేమ వేలుపుగా సాక్షాత్కరించావు...
నా ఊహారూపానికి
 

ప్రతి రూపంగా నిలిచావు...


నీ ప్రతి కదలిక
 
నాకు అపురూపమే...
నీ ప్రతి మాట
 
నాచెవికి అలంకృతమే...
నీలో కనిపించిన ప్రతి భావం
నామదిని తాకిన
శీతల సమీరమే...

నా మనోచిత్రాన్ని
 
అనుకరించి,
అనుసరించి
 
నిన్ను సృజించిన
 

ఆ విరించి "అభినందనీయుడా?"...


నిన్నందనంత దూరాన నిలిపి
 
అందుకోలేని స్థానంలో నిలిపిన
 
ఆ బ్రహ్మ "నిందనీయుడా?."..                              @శ్రీ 


21 comments:

 1. అంత పని చేసాడా?? ఆ విధాత..
  హన్నా ...!
  వలపు పదాల 'శ్రీ'బంధాలకి వయ్యారి చిక్కదనుకున్నాడా ఏం?
  అందమైన కవిత ఎప్పటిలాగే..:))

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు ధాత్రి గారూ!...
   కదా మరి...విధి వ్రాతను విధాత కూడా మార్చ లేకపోయాడు మరి...:-(...
   శ్రీ బంధానికి చిక్కింది కానీ దక్కలేదు...:-)...
   @శ్రీ

   Delete
 2. mirante bhayam ledu kadaa ....bhale raasaru baavundi

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు మంజు గారూ!
   మీకు నా భావాలు నచ్చినందుకు.
   ...భయపెట్టాలి ఈసారి కనపడితే...@శ్రీ

   Delete
 3. చాలా బాగారాసారండి.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు పద్మ గారూ! మీ మెచ్చుకోలుకి...@శ్రీ

   Delete
 4. Replies
  1. thank you prince.
   for ur nice compliment...:-)..@sri

   Delete
 5. Replies
  1. ధన్యవాదాలు వనజ గారూ! మీకు కవిత నచ్చినందుకు...@శ్రీ

   Delete
 6. Replies
  1. ధన్యవాదాలు భావనా!
   మీకు నా భావం నచ్చినందుకు...@శ్రీ

   Delete
 7. అంతగా ఆరాధించే హృదయాన్ని అందుకోనివ్వని ఆ బ్రహ్మ ఖచ్చితంగా నిందనీయుడే...
  అంతటి అందమైన భావాన్ని కవితలో అందంగా చెప్పారు.

  ReplyDelete
  Replies
  1. చిన్ని ఆశ గారూ!...
   :-)...
   అయితే నిందిన్చేస్తాను మొహమాట పడకుండా!...
   ధన్యవాదాలు మీ ప్రశంసకు...@శ్రీ

   Delete
 8. మీ చేత ఇన్ని కవితలు రాయిస్తున్న ఆ విరించి "అభినందనీయుడే"
  అందితే ఇన్ని కవితలుంటాయా శ్రీ గారు?
  ఉండవు కాక ఉండవు...:))

  ReplyDelete
  Replies
  1. ఏమిటో ఇలా శత్రువులు మిత్రుల రూపం లో ఉంటారని ఇప్పటి దాకా తెలుసుకోలేక పోయాను...:-)...:-)....(కిడ్డింగ్)
   వెన్నెల గారూ!...అలా అనకపోతే అందితే ఇంకెన్ని కవితలు, కథలు జాలువారేవో 'శ్రీ' కలం నుంచి అనొచ్చు కదా!...
   ధన్యవాదాలు మీ సరదా స్పందనకు...@శ్రీ

   Delete
 9. అభినందనా,నిందా అని సందేహం లేదండీ..
  ఈ విషయంలో "జలతారువెన్నెల" గారి అభిప్రాయమే నాది కూడా :)

  ReplyDelete
  Replies
  1. రాజి గారూ!...ఈ దేశంలో ఉన్న వాళ్ళని వదిలి అలా పరాయి దేశం లో ఉన్న వారి పక్షానికి వెళ్ళడం ఏమీ బాగా లేదు...:-)
   ధన్యవాదాలు మీకు...పరోక్షంగా నా కవిత నచ్చేసిందన్నందుకు...@శ్రీ

   Delete
 10. ఎప్పటిలా చాలా బాగా రాసారు...శ్రీ గారు

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు ప్రియ గారూ!...
   మీకు కవిత నచ్చినందుకు...@శ్రీ

   Delete