24/12/2012

అదృశ్య బంధం
ఎక్కడో నువ్వు... 
ఇక్కడ నేను...
ఒకరితో ఒకరు 
నిత్యం మాట్లాడుతున్నాం...
ఒకరినొకరు 
చూసుకుంటున్నాం...
భావాలు పంచుకుంటున్నాం...
చిత్రాలు పంపుకుంటున్నాం
తలపులు చేరవేసుకుంటున్నాం...

నిన్ను నన్ను దగ్గర చేసిందదే అయినా 
దాని వలెనే నీ పలకరింపులు 
నిత్యం వింటున్నా, 
ఎందుకో అదంటే నాకింత అసూయ?

నీ మెడలో ఉంటె 
నీ ఎద సవ్వడి వింటుంటుంది
నాకంటే చేరువగా ఉన్నట్లుంటుంది...
మాట్లాడుతుంటే 
నా ఊపిరి కంటే దగ్గరగా...
నీ ముత్యాల జూకాలను స్పృశిస్తూ..
చెవిని వెచ్చగా తాకుతూ...
నునుపైన నీ చెంపను ముద్దాడుతూ 
"నీకంటే నీమాటలు వినిపించే నేనే ప్రియం"
అంటూ వెక్కిరిస్తుంటుంది...

నాకు సందేశాలు పంపే 
నీ చేతివేళ్ళ లాలిత్యం 
తనకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదేమో!
నీ ప్రేమ సందేశం చదువుతుంటే...
మునివేళ్ళతో నా గుండెల మీద అక్షరాలు వ్రాస్తూ...
నీ ఎదలోని  భావాలకు 
పద రూపం ఇస్తూ...
నీ వలపు సిరాతో...
నేరుగా నా హృదయ పత్రంపై 
లిఖిస్తునట్లుంటుంది...

నా ఎదురుగా 
నీవుసిగ్గుతో చెప్పలేని భావాలు 
నీ సందేశాలలో కనిపిస్తూ...
నా కళ్ళు సైతం సిగ్గుపడేలా చేసేస్తాయి...

కాల్ లాగ్ లో...
డయల్ చేసిన నంబర్లలో,
రిసీవ్ చేసుకున్న నంబర్లలో ,
మిస్ కాల్స్ లో ,
మొదట నువ్వే కనిపిస్తూ...
నువ్వు నాకు దూరంగా ఉన్నావనే భావాన్ని 
దగ్గరకు రానీయదు...

నీ పిలుపుకి 
సైలెంట్ లో సైతం పెద్దగా మోగేస్తుంది.
నీ మాటల ముత్యాలను
పోగు చేసుకుంటుంది... 
నా మనసుపై మల్లెల్లా చల్లగా కుమ్మరిస్తుంది...


నువ్వు నేను ఒక్కటయ్యేంత వరకూ...
మన 'మన 'లోని అనుభూతుల గుచ్చాన్ని 
అదృశ్యంగా బంధించే దారం...ఆధారం ఇదే కదూ!....  @శ్రీ 

18 comments:

 1. అదృశ్య బంధం..సదృశ్యం చేసుకోవచ్చునండోయ్..వీడియో చాటింగ్ ఇప్పుడు మొబైల్స్ లో కూడా అందుబాటులో ఉంది కదా..:))
  చాలా చాలా బాగుంది శ్రీ గారు..

  ReplyDelete
  Replies
  1. నిత్యం మాట్లాడుతున్నాం...
   ఒకరినొకరు
   చూసుకుంటున్నాం...
   భావాలు పంచుకుంటున్నాం...
   చిత్రాలు పంపుకుంటున్నాం......ఇది సదృశమే .....బంధం తీగలు లేనిది కదా! అది అదృశ్య బంధం....
   బోలెడు ధన్యవాదాలు మీ ప్రశంసకు...@శ్రీ

   Delete
 2. కాలం సైతం ఆగిపోయి మరీ వింటుది నీ మాటలని ,

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు లక్ష్మీ!...నీకు నచ్చినందుకు....@శ్రీ

   Delete
 3. కాలం సైతం ఆగిపోయి మరీ వింటుది నీ మాటలని ,

  ReplyDelete
 4. హ హా ... నిజం, ఎందరినో అదృశ్యంగా బంధించే దారం...ఆధారం...ఇదే!
  చిన్ని భావన, సున్నితమైన భావన, బాగుంది.

  ReplyDelete
  Replies
  1. నేను ఈ కవితకి ప్రతిస్పందనలు ఇవ్వలేదన్న విషయం ఇప్పుడే గోర్తోచ్చింది....ధన్యవాదాలు చిన్ని ఆశ గారూ!...మీ ప్రోత్సాహానికి ప్రశంసకి...@శ్రీ

   Delete
 5. chala chala baagundandi adrusya bandham

  ReplyDelete
  Replies
  1. బోలెడు ధన్యవాదాలు రమేష్ గారూ!...మీ ప్రశంసకి....@శ్రీ

   Delete
 6. నువ్వక్కడ నేనిక్కడ అంటూ సెల్ ఫోన్ సందేశం చాలా బాగుంది "శ్రీ" గారూ..
  మొత్తానికి మొబైల్స్ అప్పుడప్పుడు మంచి ఆధారం కూడా అన్నమాట :)

  ReplyDelete
  Replies
  1. అంతే కదా రాజి గారూ!...జస్ట్ పెళ్లి కుదిరిన జంట ముచ్చట్లుగా దీనిని మలిచాను...మీకు నచ్చినందుకు ధన్యవాదాలు ...@శ్రీ

   Delete
 7. అదృశ్యబంధం దృశ్యబంధమై అనుబంధమైతే అందమైన జీవితం లేదంటే?

  ReplyDelete
  Replies
  1. మీరన్న మాటలో తర్కం ఉందంటాను..మీ మాటకు నా ఓటు ఇదిగో అంటాను....ధన్యవాదాలు తర్కం గారూ!...@శ్రీ

   Delete
 8. అదృశ్య బంధమైనా....ఆనందాన్నిచ్చే బంధమే:-)

  ReplyDelete
  Replies
  1. కదా!...మీకు తెలియకుండా ఎలాఉంటుంది చెప్పండి పద్మ గారూ!...:-)...@శ్రీ

   Delete
 9. Excellent chaalaa baavundi....eppatilaa...gelupu meede :)

  నా ఎదురుగా
  నీవుసిగ్గుతో చెప్పలేని భావాలు
  నీ సందేశాలలో కనిపిస్తూ...
  నా కళ్ళు సైతం సిగ్గుపడేలా చేసేస్తాయి....chaalaa baavundi.....
  Sri garu

  ReplyDelete
  Replies
  1. సుందరప్రియ గారూ!...మీ చక్కని ప్రశంసకి బోలెడు ధన్యవాదాలు....:-)...@శ్రీ

   Delete
 10. me matalo sri sri garu agupaduthunadadi

  ReplyDelete