01/01/2013

నా ప్రణయమే వేలుపైరాత్రి అయితే చాలు,
టన్నుల బరువుతో అదిమేస్తూ,
నాకనురెప్పలపై 
అదనపు బలాన్ని 
ప్రయోగిస్తూ,
నా కన్నులు మూసేందుకు 
విశ్వప్రయత్నం చేస్తూ 
ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది నిద్ర..

నిన్ను 
తొలిసారి
చూసినప్పటినుండి
కంటికి కనిపించనంత 
దూరంగా పారిపోయింది,
సున్నితమైన కనురెప్పల్ని సైతం 
మూయలేని బలహీనురాలైంది.

నల్లని నిశీధి సాగరం నుంచి 
నిత్యం వికసించే రజతకమలం 
ఆ సాగరాన్ని కాంతిమయం చేసినట్లు,
నీ ప్రణయ ప్రభలు 
నాకళ్ళకెప్పుడు వెన్నెలనిస్తాయో?

ఆ వెన్నెల వెలుగులు  చూడకుండానే 
ఈ శ్వాస ఆగుతుందేమోననే భయం...
రాత్రనక పగలనక
నన్ను కలలో సైతం 
తరుముతూనే ఉంటుంది.

ఎందుకా వెదుకులాట?
నీ అన్వేషణ ఆగేది ఎప్పటికో?
అంటారంతా.
వారికేం తెలుసు?
నా ప్రణయమే వేలుపై నా ముందు నిలిచినా,
అది ...నీవుకాలేదుగా!                                                              @శ్రీ10 comments:

 1. చాలా బాగుంది , picture selection bagundi.నిజమే, మొదటు సారి చూస్తే మనసు నిలవనీయదు, మళ్ళీ మాటాడాలని చూడాలని అనిసిస్తుంది, నిద్ర కూడా పట్టదు, ఏదో తెలియని ఆరాటం మనిషిని నిలువనీయదు,పదాలు అల్లిక చాలా బాగుంది, మంచి కవిత
  ,

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు శ్రీ లక్ష్మి!...మీ ప్రశంసకు...@శ్రీ

   Delete
 2. నూతన సంవత్సరం మీ ప్రేమవాహిని పెల్లుబుకాలని కోరుకుంటూ...

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు పద్మ గారూ!...మీకు కూడా శుభాకాంక్షలు...@శ్రీ

   Delete
 3. Eppatilaane chaalaa chakkani kavita sri garu

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు మంజు గారూ!...మీకు నా భావం నచ్చినందుకు....@శ్రీ

   Delete
 4. పదాలతో కరటే...కుస్తీ..కుంగ్ఫూ ..ఇన్ని ఎలా ఆడేస్తారండి.??
  A beautiful one..:))
  Happy New Year..

  ReplyDelete
  Replies
  1. ఏమో మీరలా అనేస్తున్నారు...పదాలతో దేబ్బలాడితే భావాలు వస్తాయా చెప్పండి?...మంచిగా ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి గానీ...:-)...మీకు కూడా నూత్న సంవత్సరపు శుభాకాంక్షలు....ధాత్రి గారూ!@శ్రీ

   Delete
 5. eppatilaa adbhutangaa undi...meeku meere saati Sri garu
  chaalaa chaalaa chaalaa baavundi.....

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు ప్రియ గారూ!...మీకు నా భావం నచ్చినందుకు.మీరు ప్రోత్సహిస్తున్న తీరుకు ...@శ్రీ

   Delete