30/12/2012

"నిర్భయ"



కామాంధుల చేతిలో 
బలి అయిన  నిర్భయ కోసం 
భారతావని 
కంట తడి పెట్టింది.
కొత్త సంవత్సరపు 
సంబరాలను చేసుకోమనే 
శపధాలు వినిపించాయి.
ఫేస్ బుక్ టైం లైన్లలో
వాగ్దానాలు కనిపించాయి.
పట్టణాల్లో కొన్ని చౌరస్తాల్లో 
కొవ్వొత్తులు వెలిగించారు 
'నిర్భయ' ఆత్మశాంతికి 
నివాళులర్పించారు.

పురుషులు 
సాయంకాలం 
తమకిష్టమైన క్లబ్బుల్లో 
నచ్చిన వైను చుక్కలతో గొంతు 
తడుపుకున్నారు.
కిళ్ళీ బడ్డీల దగ్గర 
లేటెస్ట్ ఐటెం సాంగుల గురించి 
చర్చిస్తూ వెకిలి నవ్వులు నవ్వుకున్నారు.
అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్ తో 
డేటింగులకి వెళ్ళారు.
స్త్రీలు తమకిష్టమైన 
సీరియళ్ళు చూసుకున్నారు.
కుర్రకారు ఎప్పటిలాగే 
అసభ్యపు జోకులతో ఈ సాయంత్రం కూడా 
ఆమ్మాయిలను వేధించారు.

ఎక్కడో ఎ మూలో మరో నిర్భయ 
ఏ మదాంధుల కామానికో 
బలియై పోతూ ఉంటుంది.
ఎక్కడో మరో కుసుమం 
నేలరాలి పోతూ ఉంటుంది.
ఎక్కడో మరో అబల
కన్నీటితో సాయం కోసం 
అరణ్య రోదన చేస్తూ ఉంటుంది.

కొత్త సంవత్సరపు సంబరాలకి 
ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరో రెండు రోజుల్లో 
లెక్కలేని గాలన్ల 
మద్యం ఏరులై పారేందుకు 
సిద్ధమౌతోంది.
బార్లు,రెస్టారెంటులు 
ముందస్తు బుకింగు  
చేసుకొంటున్నాయి.
వ్యాపార చానెళ్ళు 
తమ ప్రోగ్రామ్స్ 
పబ్లిసిటీ చేసుకుంటూ ఉన్నారు.

ఇదేనా మనమిచ్చే నివాళి?
ఒక్క సారి ఒక్క చుక్క కన్నీరేనా వదిలేది?
ఆ మదాంధులకి శిక్ష పడుతుందో లేదో తెలీదు.
వాళ్ళను తప్పించేందుకు 
ఎన్ని జేబులు బరువెక్కుతున్నాయో తెలియదు.

ఈ "నిర్భయ" (2012)నామ సంవత్సరం 
ఆఖరి రోజంటే...
ఆ మృగాలకు  సరైన శిక్ష పడిన రోజే.
మహిళల రక్షణకి సరైన 
చట్టం చేసిన రోజే...
ఆ చట్టాన్ని సరిగా అమలు చేసిన రోజే...
దేశంలోని  ప్రతి మహిళా "నిర్భయంగా"
బైటకి వెళ్ళగలిగిన రోజే...

"నిర్భయ"కి దుఖాశ్రువుల తో నివాళులర్పిస్తూ ...@శ్రీ 














 








 











11 comments:

 1. దోషులకు శిక్షపడిన రోజునే ఆమె అత్మకి శాంతి,అమె మరణాన్ని వృదా పోనివ్వకుండా ప్రతి ఒక్కరు న్యాయం జరిగిలా దోషులకు శిక్ష పడేలా చూడవలసిన భాద్య్తత ఉంది

  ReplyDelete
 2. మనిషికి జన్మించటం కాదు,మనిషికి జీవించినపుడే మనిషి జన్మ కి సార్ధకత , నిండు ప్రాణం అర్ధాంతంగా పోయింది , బంగారు భవిష్య్త్త్తత్తు కోసం కన్న కలలు కామాందుల చేతిలో కల్లలు గామారిపోయాయి,సభ్య సమాజం తల ఎత్తుకోలేని పరిస్తితి, దోషులకి సరి అయిన శిక్ష పడినపుడే ఆమె ఆర్మకి శాంతి, ఆమె మరణాన్ని వృదా గా పోనివ్వకుండా దోషులను ఉరి తీసి పాడేయాలి, ఇటువంటి సంఘటనలు జరగకుండా చట్టాలను కఠినతరం చేయాలి ,

  ReplyDelete
 3. మీ కవిత చదివాను
  ప్రతి అన్న , తమ్ముడు ,తండ్రి మీలాగే ఆలోచించాలని కోరుకుంటాను .....ప్రియ

  ReplyDelete
 4. నివాళులర్పించి నిదుర పోయేవాళ్ళు పోతున్నారు...
  ఇంకో ఆసక్తికరమైన వార్తతో దీన్ని మరచిపోతారు:-(

  ReplyDelete
 5. ఇది రేపటికి పాత న్యూస్ అయిపోతుందండి:-(

  ReplyDelete
 6. చాలా దయనీయమైన సంఘటన. అన్నిటికన్నా బాధాకరం, అలాంటివాళ్ళు సులభంగా తప్పించుకునేదుకు వీలు కల్పించిన మన రాజ్యాంగం!

  ReplyDelete
 7. చట్టాలు మనం సరిగ్గా అమలు జరిగేలా చూడాలి...
  నేరస్తులకి శిక్ష పడాలి...
  ఇలాంటి నేరం భవిష్యత్ లో ఎవరూ
  చేయదానికి భయపడేలా ఉండాలి ఆశిక్ష..
  స్పందించిన అందరికీ ధన్యవాదాలు....@శ్రీ

  ReplyDelete
 8. శ్రీ గారు కదిలించిన విషయాన్ని గూర్చి మీర్రాసిన కవిత రాగిలించేదిగా వుంది. నిరాశావాదాన్ని దరిచేరనీయక నిర్భయంగా మన ప్రయత్నం మనం చేద్దాం. అప్పుడే మనకు నిజమైన పండుగ.

  ReplyDelete
 9. chaduvutunte hrudayam baruvekki poyindi....ii raakshasula kabandhaalanundi vimukti eppudo aa devude cheppaali :((...baadha..baadha...baadha...tappa inkemi ledu :((

  ReplyDelete