06/01/2013

ఎవరి ప్రేమది పైచేయి?




నీ పదముల సవ్వడి
వేల మైళ్ళ  దూరం నుంచే 
నా చెవులు ఎలా పసిగడతాయో  తెలియదు...

నీ సిగలోని పూల పరిమళం 
కోసుల దూరం నుంచే 
నా నాసిక ఎలా ఆఘ్రాణిస్తుందో తెలియదు...

నీవక్కడ నవ్విన చిరునవ్వులవెలుగులు 
ఇక్కడ నా కంటిలో 
ఎందుకు ప్రతిఫలిస్తాయో తెలియదు... 

నీవక్కడ నను తలచిన విషయానికి 
ఇక్కడ నా మనసుకి 
ఎందుకు పొర మారుతుందో  తెలియదు...

నీవక్కడ  నా చిత్రాన్ని తాకితే 
ఇక్కడ నా మేను
ఎందుకు పులకరిస్తుందో తెలియదు...


కానీ....
ఇక్కడ  నా కంట కన్నీరొలికితే 
అక్కడ నీ  చెక్కిళ్ళు 
ఎందుకు తడుస్తున్నాయో మాత్రం  తెలుసు 

నా  గుండెలోని విరహపు కాట్లు 
అక్కడ నీ  ఎదలో 
ఎందుకు పలుగు పోట్లౌతున్నాయో  మాత్రం తెలుసు.

నీ వియోగం నన్నిక్కడ అనుక్షణం  మింగేస్తుంటే 
అక్కడ నీకు ఊపిరి
ఎందుకు సలపదో మాత్రం  తెలుసు.

తెలిసీ తెలియనిదల్లా ఒక్కటే.
అర్ధమైనా...ఎప్పటికీ అర్ధం కానిదొక్కటే.
ఎవరి  ప్రేమది 'పై చేయో'?                            @శ్రీ                          









16 comments:

  1. తెలిసీ తెలియనిదల్లా ఒక్కటే.
    అర్ధమైనా...ఎప్పటికీ అర్ధం కానిదొక్కటే.
    ఎవరి ప్రేమది 'పై చేయో'? చాలా అందంగా ఉంది భావన, ప్రేమ లో మనం గెలిచి ప్రేమించిన మనషికి గెలుపుని ఇస్తే ఇద్దరిది సమానం, ప్రేమ అనేది పంచిన కోద్ది మనిషి మనసు పురివిప్పిన నెమలి వలె నాట్యం చేస్తూఆనంద తీరాలని తా కిస్తుంది, వేల మైళ్ళుదూరంలో ఉన్న ప్రేమించిన మనిషి మనసు పరిస్తితి తెలిసిపొతుంది ప్రేమని పంచటం, అదే రకమైన ప్రెమని తిరిగి పొందటం అనేది ఎంతో అదృష్టం ఉంటే దొరుకుతుంది.చాలా చాలా చక్కగా రాశావు, అభినందనలు,

    ReplyDelete
    Replies
    1. అవును లక్ష్మి!...బాగా చెప్పావు నా కవితలోని సారాన్ని ...ధన్యవాదాలు మీకు...@శ్రీ

      Delete
  2. "ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్లుంటుంది"
    అనిపించే ప్రేమ భావనల్లో ఎవరి ప్రేమ వాళ్ళదే పై చేయి అనిపిస్తుందేమొనండీ..
    కవిత,పాట చాలా బాగున్నాయి..

    ReplyDelete
    Replies
    1. రాజి గారూ!...అంతేనండి...ఎవరికీ వాళ్ళదే పై చేయి అనిపిస్తుంది...ధన్యవాదాలు మీకు కవిత,..ఎంచుకున్న పాట...నచ్చినందుకు...@శ్రీ

      Delete
  3. chaalaa chakkani vyaktikarana eppatilaane chakkagaa vundi abhinandanalu sri garu

    ReplyDelete
    Replies
    1. మంజు గారూ!...ధన్యవాదాలు మీకు నాభావాలు నచ్చినందుకు...మీ అభినందనలకు నా అభివాదాలు...@శ్రీ

      Delete
  4. చాల బావుందండి ప్రేమలో అనే కంటే అందమైన వేదనలో ఎవరిది పై చేయి అనాలేమో ప్రేమైనా వేదనైనా ఇద్దరూ సమానమే అన్నట్లున్నారు

    ReplyDelete
    Replies
    1. అవును వీణ గారూ!...ప్రేమ వేదఅ రెండూ వేరు వేరు కాదు...ఒకదానిలో ఇంకోటి వుంటాయి...ప్రేమదే పై చేయి...ఇద్దరూ మాత్రం సమానం...అంతేనంటారా?@శ్రీ

      Delete
  5. Replies
    1. మీ ప్రశంసకి ధన్యవాదాలు రమేష్ గారూ!...@శ్రీ

      Delete
  6. అనుమానం ఎందుకు? మీ ఇరువురి ప్రేమే పై చేయి.

    ReplyDelete
    Replies
    1. అవును జ్యోతి గారూ!...సందేహం వలదు మీరు చెప్పాక కూడా!....:-)...@శ్రీ

      Delete
  7. Replies
    1. ధన్యవాదాలు స్వర్ణ గారూ!...మీకు నా భావాలు నచ్చినందుకు....@శ్రీ

      Delete
  8. చాలా మంచి భావం గొప్పగా కవితలో చెప్పారు.
    ప్రేమలో ఎప్పుడూ ఒకరి ప్రేమ కన్నా ఇద్దరి ప్రే"మదే" పైచేయి.

    ReplyDelete
    Replies
    1. ఎక్సలెంట్ ...నేను చెప్పిన దానికంటే...మీరు చెప్పిన ప్రే"మదే" పై చేయి అందం భలే నచ్చేసింది....మీ ప్రశంసకి ధన్యవాదాలు....చిన్ని ఆశ గారూ!...@శ్రీ

      Delete