14/02/2013

ప్రేమ ప్రేమ ప్రేమ



ఆకాశం ఔన్నత్యంతో పోటీ పడేది ప్రేమ.
పృథ్వికున్న క్షమతో సమానంగా నిలబడేది ప్రేమ.
అగ్నిశిఖలా ప్రజ్వలించేది ప్రేమ.
శీతల సమీరంలా స్పృశించేది ప్రేమ.
జలధితరంగంలా ఎగసిపడేది ప్రేమ.
పంచభూతాల సమాహారం ప్రేమ...

కంటికి నచ్చిన వారిని కన్నుల్లో నింపుకొనేది ప్రేమ.
చెవికి ఇంపైన మాటలు ఎప్పుడూ వినాలనిపించే భావం ప్రేమ.
పెదవులు తీయగా ఆ పేరునే పిలవాలనిపించడమే ప్రేమ.
ఒకరి ఊపిరిని మరొకరు శ్వాసించేది ప్రేమ.
నచ్చినవారి వెచ్చని స్పర్శను మళ్ళీ మళ్ళీ కోరుకొనేది ప్రేమ.
పంచేంద్రియాల ఏకత్వం ప్రేమ... 

ఊదాలోని సున్నితత్వం ప్రేమ.
నీలిమందు (వర్ణం)లోని నిజాయితీ ప్రేమ.
నీలిరంగులోని నమ్మకం ప్రేమ.
హరితంలోని  ప్రకృతి ఆరాధన ప్రేమ.
పసుపులోని సృజనాత్మకత ప్రేమ.
కెంజాయలోని ధనాత్మకత ప్రేమ.
ఎరుపురంగులోని ఉత్తేజం ప్రేమ.
హరివిల్లులోని అన్నివర్ణాలు కలిసిన శ్వేతవర్ణమంత స్వచ్చమైనది ప్రేమ.

ప్రేమికుల మనసులో... 
నిరంతరం వెలిగే  'అఖండజ్యోతి' ప్రేమ.
ప్రేమికుల భావగీతి ప్రేమ.
ప్రేమికులు ఉన్నా లేకున్నా ఈవిశ్వంలో శాశ్వతంగా నిలిచిపోయేది ప్రేమ....@శ్రీ 







5 comments:

  1. ఎంత కమ్మనైనది మీ కవితా ప్రేమ. శ్రీ గారు చాలా బాగుంది.

    ReplyDelete
  2. చక్కటి ప్రేమకవిత శ్రీ గారు.

    ప్రేమ ఒక యాగం,
    ప్రేమ ఒక యోగం,
    ప్రేమ ఓ అంతరంగ ప్రవాహం,
    ప్రేమ ఓ జీవధార,
    ప్రేమ ఓ ఆనంద వాహిని,
    ప్రేమ ఓ అమృత వాహిని,
    ప్రేమ విశ్వజనీయమైంది!

    ReplyDelete
  3. చాలా గొప్పగా చెప్పారు శ్రీ గారూ.
    ప్రేమికులు అశాశ్వతం, వారి ప్రేమ మాత్రమే అమరం!

    ReplyDelete
  4. చాలా బాగుంది శ్రీనివాస్ గారు.

    ReplyDelete
  5. "ప్రేమికులు ఉన్నా లేకున్నా ఈవిశ్వంలో శాశ్వతంగా నిలిచిపోయేది ప్రేమ.."

    చాలా బాగుంది " శ్రీ " గారు.

    ReplyDelete