07/03/2013

శాకుంతలం 1







||మేనకా విశ్వామిత్రం ||...శాకుంతలం 1

నిప్పులు చెరిగే ఎండ
మౌనిపై మంచులా కురిసింది.
హోరున కురిసే వర్షం
చల్లని విరిజల్లుగా మారింది
గడగడలాడించే చలి
వెచ్చని కంబళిలా కప్పింది.

క్రూర మృగాలు
సాధు జంతువులై
తాపసి ముందు మోకరిల్లాయి.
విషసర్పాలు
అమృతం చిమ్మాయి.

ప్రకృతి ఆతని ఆధీనమైంది.
ఘోరతపానికి జోహారులంది.
ఆ క్రోధ వీక్షణానికి
ఐరావతం వెనుదిరిగింది.
వజ్రాయుధం సైతం వణికి పోయింది


నింగి నుండి
ఓ విద్యుల్లత  పృథ్విని రాలింది.
తపం తాపమైంది.
కమండలం దూరమైంది.
దర్భాసనం పూల పానుపైంది.
తాపసి మనసు.
అద్భుత  సౌందర్యానికి
దాసోహమంది.
తపమాచరించిన పెదవి
ఆమె మెడవంపులో తలదాచుకుంది.
జప మాలను తిప్పే చేయి
నిమ్నోన్నతాలను సవరించింది.
ప్రకృతి స్తంభించింది
విశ్వామిత్రం మేనకలో మమేకమైంది...@శ్రీ 

16 comments:

  1. చాలా బాగుంది శ్రీ గారు!

    ReplyDelete
    Replies
    1. మీ ప్రశంసకి ధన్యవాదాలు భారతి గారూ!...@శ్రీ

      Delete
  2. Good. ur blog allowed me to comment

    ReplyDelete
    Replies
    1. ధన్యోస్మి శర్మ గారూ...మీ ప్రశంసకి ధన్యవాదాలు ...@శ్రీ

      Delete
  3. Replies
    1. మీ ప్రశంసకి ధన్యవాదాలు ధాత్రి గారూ!...@శ్రీ

      Delete
  4. Replies
    1. మీ ప్రశంసకి ధన్యవాదాలు వెన్నెల గారూ!...@శ్రీ

      Delete
  5. Wonder full .. Ilaa meeru maatrame vraaya galaru anipinchelaa.. Really wonder full.

    ReplyDelete
    Replies
    1. మీ ప్రశంసకి ధన్యవాదాలు వనజ గారూ!...
      ఇలా ఆత్మీయంగా మెచ్చుకునే మాటలే నా కలానికి కొత్తఊపిర్లు
      పోసేది....@శ్రీ

      Delete
  6. Replies
    1. థాంక్ యు పద్మ గారూ...@శ్రీ

      Delete
  7. శాకుంతలం మీ కవితల రూపం లొ చదవబోతున్నమన్నమాట..
    "శాకుంతలం 1" బాగుంది " శ్రీ " గారూ..

    ReplyDelete
    Replies
    1. ప్రయత్నం చేస్తున్నాను ...ఎప్పుడో మేరాజ్ గారు అన్నారు కృష్ణుని గురించి అష్ట సుమమాలికను సమర్పించినపుడు...ఇలాంటిది వేరే ఏదైనా వ్రాయవచ్చు కదా అని...ఇప్పటికి వీలు పడింది...మిగిలినవి కూడా మిమ్మల్ని ఆకట్టుకున్తాయనై ఆశిస్తున్నాను ...మీ ప్రశంసకి ధన్యవాదాలు రాజి గారూ!...@శ్రీ

      Delete
  8. పదాలకు పదును బాగా పెట్టావు చదువుతుంటుంటే మైండ్ ని కోసేస్తోంది అంత షార్ప్

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు లక్ష్మీ!...నీ అతిశయాలంకారానికి...నీ ప్రశంసకు...@శ్రీ

      Delete