11/04/2013

"విజయోత్సాహాల ఉగాది "


ప్రేమను ప్రేమించు...ప్రేమకై!...గ్రూప్ నిర్వహించిన ఉగాది కవితల పోటీలో 'ప్రథమ బహుమతి' పొందిన నాకవిత...ఈ విజయాన్ని          శ్రీ విజయ నామ సంవత్సరంలో  అందరికీ పంచుతూ....మీ మిత్రుడు @శ్రీ 

||విజయోత్సాహాల యుగాది ||....(ఉగాది కవితల పోటీకి)

నవపల్లవ కుసుమ పరాగాన్ని మోసుకొచ్చే 'పిల్ల'గాలుల పరిమళాలు.
మామీచిగురు తిని మత్తెక్కిన కోకిల ఆలపించే మధుర గీతికలు.
సీతాకోక చిలుకల కోలాహలాలు
కొమ్మలకున్న ప్రతి సుమాన్నీ పలకరిస్తూ
మోహావేశంతో మధుసేవనానికి తొందరపడుతూ మధుపాలు చేసే ఝంకారాలు.

తేటికాటు తిన్న పూబాలలు సిగ్గుతో తలలు దించుతూ
పుప్పొడి అంటిన తుమ్మెద పాదాలనుమకరందాలతో అభిషేకిస్తూ,
ఆ పాదాలను తుడిచే సుమదళాలు.

వన్నెల వయ్యారుల కొప్పులలో మత్తెక్కించే మల్లెల సౌరభాలు.
జడ చాటున దాగి పరిమళాల జావళీలు పాడే విరజాజుల మాలికలు.
యువకుల మనసులలో దూసుకుపోయే మదనుని అదృశ్య శరాలు.

నలుదిశలా వేవేల వర్ణాలతో సర్వాలంకార శోభితమై
నందనవన సౌందర్యాన్ని తలదన్నేభూలోక ఉద్యానవనాలు.
శుకపికాల సంగీత సమ్మేళనాలు.

నన్ను గెలిచేందుకు కాముని తోడు తెచ్చుకున్నావంటూ,
విజయ వాసంతుని పరిహసించే వనకన్య విరిజల్లుల మందహాసాలు.
మనసున నవనవోత్సాహంతో
చైత్రరథానికి స్వాగతం పలుకుతున్న సుమవనాలు

మంచుపూల దుప్పటి కప్పుకున్న శిశిరాన్ని తరుముతూ
పూలతేరుపై వాసంతుని ఆగమనం.
ప్రకృతి కాంతపై వలపువిజయం సాధించాలని...
ఎల్లరకూ శుభాలు పంచాలని... 'శ్రీ'

9 comments:

  1. విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీ గారూ!

    ReplyDelete
  2. శ్రీ సర్ విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలుచాలా బాగుంది

    ReplyDelete
  3. ఉగాది శుభాకాంక్షలు 'శ్రీ' గారూ!

    ReplyDelete
  4. మీకు కూడా విజయనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు;

    Congrats Srinivas gaaru .

    ReplyDelete
  5. విజయనామ సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా...

    ReplyDelete
  6. ప్రైజు మీకు కాక ఇంకెవ్వరికి వస్తుంది శ్రీగారు?
    బాగుంది, అభినందనలు.

    ReplyDelete
  7. హృదయ పూర్వక శుభాభినందనలు.

    ReplyDelete
  8. మీకు కుడా ఉగాది శుభాకాంక్షలు శ్రీ గారు :)

    ReplyDelete
  9. తెలుగు భాష లోని అందమంతా మీ కవితలో జాలువారింది.పదాల పరిమళాన్ని కవితంతా అద్దారు.మీ కవిత తెలుగువెలుగు మార్చ్ సంచికలో పడింది.మీకు అభినందనలు.

    ReplyDelete