॥ నాన్న॥
ఓ వులేన్ ప్యాంటు
ఓ టెర్లిన్ షర్టు
కోరమీసం
చలువకళ్ళద్దాలతో నాన్న.
అమ్మకి పూలు
తాతకి మందులు
నాకు బిస్కెట్లు
చెల్లికి చాక్లెట్లతో నాన్న.
అమ్మ రోగానికి
నా చదువుకి
చెల్లి పెళ్ళికి
అప్పులతో నాన్న.
ఓ వాలుకుర్చీ
ఓ కళ్ళజోడు
ఓ న్యూస్ పేపరు
పక్కనో టీ కప్పుతో నాన్న
దుమ్ముపట్టిన ఫ్రేములో
వాడిన పూలదండతో
మా నిర్లక్ష్యానికి సాక్ష్యంగా
నవ్వుతూ అమ్మ పక్కన నాన్న. ... @ శ్రీ ...
(తెలుగు వన్ లో ప్రచురించబడిన కవిత )
http://www.teluguone.com/sahityam/single.php?content_id=260
నాన్న గురించి మీ కవిత....చాలా చాలా బావుంది శ్రీ జీ.
ReplyDeleteధన్యవాదాలు శ్వేత గారు ..మీ ప్రశంసకి ...@శ్రీ
Deleteచాలా రోజులకి మీ కవిత.
ReplyDeleteబాగుంది.
మనసు ఫ్రేం లో నాన్న రూపం చెదరక ఉంటే చాలు.
Happy Father's Day!
ధన్యవాదాలు చిన్ని ఆశ గారు ..
Deleteనేను చాల వ్రాసాను ..
నేను FB లో ఎక్కువ బిజీ అయ్యి కాస్త ఇటు రాలేకపోయా..ఇక రెగ్యులర్ అవుత ...అంతే ...
మీకు కూడా Happy Father's Day! శుభాకాంక్షలు...@శ్రీ
chalaa baaga raasaarandi chinni chinni padaalatho o jeevitha kaalaanni chakkagaa vivarinchaaru
ReplyDeleteబోలెడు ధన్యవాదాలు రమేష్ గారు...
Deleteమీ ప్రశంసకి .@శ్రీ
చాన్నాళ్ళకి బ్లాగ్ లో....చాలాబాగుందండి.
ReplyDeleteధన్యవాదాలు పద్మార్పిత గారు...
Deleteమీ ప్రశంసకి...@శ్రీ
superb and wonderful poetry
ReplyDelete