19/06/2013

నేనెవరో చెప్పాలా ?

శ్రీ || నేనెవరో చెప్పాలా ||

నీ తలపు వెనుక
వలపును నేనై
పలకరించిపోతున్నా.
మదితంత్రులను మీటి పోతున్నా.

నా ఊహకి రెక్కలొచ్చి
ప్రణయసందేశాన్ని మోసుకుంటూ
శ్వేత కపోతమై
నీ భుజంపై వాలుతున్నా.

నా కెంపు పెదవిపై విరిసిన దరహాసమై
నీమదిని కోసే చంద్రహాసమై
సప్తవర్ణాలను నింపుకున్న
ధవళ కిరణమై
సమీరంలోని నిశ్శబ్ద ప్రేమలేఖనై
రాగాలపల్లకిలో నిను పలకరించే
మౌనగానమై మదిని తాకుతున్నా.

నీకై వ్రాసే కవనాన్నై
అక్షర నివేదన చేసే గీతాన్నై
నీ చక్షువులను తాకుతున్నా
నీ శ్రవణాలలోనికి చేరుకుంటున్నా

ఇంకా అడుగుతున్నావా
నేనెవరని?
ఇంకా ప్రశ్నిస్తున్నావా
నీదైన నా అస్తిత్వాన్ని.........శ్రీ


9 comments:

  1. చాలా రోజులకి మంచి కవితతో వచ్చేశారు.
    ఇంకా చెప్పలా మీరెవరో?

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు చిన్ని ఆశ గారు ...
      ఈ కవితలను ఓ పుస్తక రూపంలో తేవాలని చిన్న ప్రయత్నం లో ఉన్నాను ...
      ధన్యవాదాలు మీ ప్రశంసకి... @శ్రీ

      Delete
  2. ధన్యవాదాలు మంజు గారు ...మీకు నాకవితామాలిక నచ్చినందుకు...@శ్రీ

    ReplyDelete
  3. బాగుంది శ్రీగారు. చాలా రోజులకు ఇలా దర్శనమిచ్చారు.

    ReplyDelete
  4. ధన్యవాదాలు వెన్నెల గారు....
    ముఖపుస్తకంలో బిజీ...అంతే ....
    :-)....@శ్రీ

    ReplyDelete
  5. నా కెంపు పెదవిపై విరిసిన దరహాసమై
    నీమదిని కోసే చంద్రహాసమై
    సప్తవర్ణాలను నింపుకున్న
    ధవళ కిరణమై
    సమీరంలోని నిశ్శబ్ద ప్రేమలేఖనై
    రాగాలపల్లకిలో నిను పలకరించే
    మౌనగానమై మదిని తాకుతున్నా.

    maatalu levandii chalaa baagundi
    meeru vrase prati kavita manasunu hattukonelaa untaayi
    thanks maakosam mee kavitanu share chesukonnanduku

    ReplyDelete
  6. ధన్యవాదాలు సుందర ప్రియ గారు ...మీ చక్కని ప్రశంసకి... @శ్రీ ....

    ReplyDelete
  7. అందంగా , అద్భుతంగా ఉంది ...

    ReplyDelete