చెంగుచెంగున దూకే లేడి కూనలు.
పొంచి చూస్తున్న శార్దూలాల వాడిచూపులు.
కొమ్మలపై చిరుతల మాటు.
దుప్పులకి తలపెడుతూ చేటు.
విషసర్పాల బుసబుసలు.
అడవి నెమళ్ళ క్రీంకారాలు.
ఘీంకరించే మత్తేభాల గుంపు ఒక వైపు.
అదను కోసం చూసే కొదమ సింహాలు మరొక వైపు.
రథ చక్రాల ధూళి కప్పేస్తోంది వనాన్ని
గుర్రాల గిట్టల చప్పుడు ప్రతిధనిస్తోంది అడవంతా
మొదలైంది దుష్యంతుని మృగయా వినోదం
రథ చక్రాల ధూళి కప్పేస్తోంది వనాన్ని
గుర్రాల గిట్టల చప్పుడు ప్రతిధనిస్తోంది అడవంతా
మొదలైంది దుష్యంతుని మృగయా వినోదం
వాడి బాణాల ప్రయోగం...
పరుగెత్తే మృగాలే ఆతని లక్ష్యం
ప్రతి బాణం లక్ష్యం భేదించేదే.
ప్రతి శరం గురి తప్పనిదే..
వనమంతా కోలాహలం.
మృగాలన్నీ కకావికలం.
దారి తప్పింది నరేంద్రుని రథం.
చేరింది కణ్వుని ఆశ్రమం.
భూపతి కళ్ళకి అద్భుత సౌందర్యాల సందర్శనం
అసంకల్పితంగానే చేసాయి చూపులు వందనం.
తొలిచూపులోనే ఇరువురి మనసులో ప్రేమాంకురం.
జరగబోయే గాంధర్వ వివాహానికి అదే వేసింది బీజం.
భూపతి కళ్ళకి అద్భుత సౌందర్యాల సందర్శనం
అసంకల్పితంగానే చేసాయి చూపులు వందనం.
తొలిచూపులోనే ఇరువురి మనసులో ప్రేమాంకురం.
జరగబోయే గాంధర్వ వివాహానికి అదే వేసింది బీజం.
adbhutamaina veta Andamaina veta arinta Andamaina aksharachitramai poindandi
ReplyDelete