16/11/2013

|| కళ్యాణ తిలకం ||







బాసికం కొత్త భాష్యాలెన్నో చెప్తోంది
బాస లేని సంజ్ఞలేవో చేస్తోంది.

నుదుటి తిలకం వరుని సిగ్గుతో తిలకిస్తోంది.
కళ్యాణ ఘడియలకై వేచి చూస్తోంది.

సిగ్గుతో వాలిన కన్నులు
మనసులోని ఆనందాలను దాచే వెలుగుదొన్నెలు.

ముక్కునున్న ముక్కుపుడక శోభ.
నక్షత్రాన్ని సైతం దిక్కరిస్తాననే ధీమా 

నల్లని కురులలో చంద్రవంక

నీలాకాశంలో వెలిగే నెలవంక

సిగలో మల్లెలమాలలు
పరిణయంలో పరిమళాల గుబాళింపులు

తలవంచుకున్న ముగ్ధమోహన రూపం
వరుని మనసులో నిలిచిపోయే వెన్నెల చాపం 

జగదేకసుందరితో కళ్యాణం
వరునికి జగతిని గుప్పెట పట్టినంత సంబరం... ...@శ్రీ

3 comments:

  1. చాలా చాలా బాగుంది, ఫోటో కుడా సూపర్ :)

    ReplyDelete
  2. || కళ్యాణ తిలకం || : బాసికంతో మొదలై పరిణయం వరకు చాలా బాగా వివరించారు. కళ్యాణ తిలకం చాలా విలువైనది మరియు పవిత్రమైనది...

    ReplyDelete
  3. చాలా బాగుంది.

    ReplyDelete