12/09/2016

|| సుఖము శాంతి - తెలుగుగజల్ |||| సుఖము శాంతి - తెలుగుగజల్ ||

|| సుఖము శాంతి - తెలుగుగజల్ ||

విశ్వశాంతి గీతాలను రచియించిన సుఖము శాంతి 
హింసలేని రాగాలను పలికించిన సుఖము శాంతి

కులమతాల జాడ్యంతో అజ్ఞానం పెరుగుతుంది 
విజ్ఞానపు వేదాలను వల్లించిన సుఖము శాంతి

దేవుళ్ళకు లంచమిచ్చి వరాలెన్నొ అడుగుతావు
జనులందరి మేలుకొరకు ప్రార్ధించిన సుఖము శాంతి

మనుస్మృతిని బోధించేవారిని వెలివేయాలీ 
వర్ణరహిత సమాజాన్ని నిర్మించిన సుఖము శాంతి

ఓట్లకి నోట్లను ఇస్తూ పిదప దోచుకుంటారు
సచ్చరిత్రగల నేతను గెలిపించిన సుఖము శాంతి

భార్యమాట మహారాజ్ఞి శాసనమని గ్రహించాలి 
ఇంటిమగడు మారాడక పాటించిన సుఖము శాంతి 

మూర్ఖులతో సావాసము ప్రమాదమే "నెలరాజా"
సద్గురువులతో పయనము సాగించిన సుఖము శాంతి

No comments:

Post a Comment