27/12/2016

|| గెలిచాయి ఎందుకో - తెలుగు గజల్ 453 ||

కన్నీటి బుడగలే పగిలాయి ఎందుకో చెక్కిలిని ఆర్తిగా తడిమాయి ఎందుకో పూలున్న హృదయాన్ని ఆక్రమించేసాయి ముళ్ళున్న పొదలెన్నొ మొలిచాయి ఎందుకో నావలో అడుగేయబోయాయి మోదాలు ఖేదాల కడలిలో మునిగాయి ఎందుకో తొలిఋతువులో పికము పాట వినబడలేదు రాగాలు శిశిరాన్ని వలచాయి ఎందుకో రెప్పలను వెలివేసి వెళ్ళాయి స్వప్నాలు కనులలో చీకట్లు మిగిలాయి ఎందుకో హేమంత ధూపాలు దయచూపలేదులే అంగార కుసుమాలు విరిసాయి ఎందుకో నీతోడు లేనపుడు నామీద "నెలరాజ" పలుమార్లు విరహాలు గెలిచాయి ఎందుకో ... #శ్రీ

6 comments:

  1. చాలా చాలా బాగుంది.. 👌👌👏👏

    ReplyDelete
  2. వావ్....అద్భతమైన భావుకత..

    ReplyDelete
  3. మళ్ళీ బ్లాగ్ లో వ్రాయండి ప్లీజ్. ఆ పాత వెలుగులు కొరవడినాయి.

    ReplyDelete
  4. తప్పకుండా పద్మగారూ... ����

    ReplyDelete
  5. Replies
    1. ధన్యవాదాలు మీకు...
      బాగున్నాను రవిశేఖర్ గారు... మీరెలా ఉన్నారు.
      9425012468...whatsapp కి ఓ msg పెట్టండి.

      Delete