29/02/2012

నీ ఆత్మనై....


నీతో ఉండాలనుకున్నా.... పూలతో తావిలా... 
కానీ, వాడిన  పూలతో తావి కూడా పోతుంది.

నీతో ఉండాలనుకున్నా....చంద్రునితో వెన్నెలలా ...
కానీ, పగలు ఆ రెండిటిని దూరం చేసేస్తుంది.

నీతో ఉండాలనుకున్నా.... నీ వెంట నీడలా.... 
కానీ, చీకటి నీనుంచి నీ నీడను దూరం చేస్తుంది...

అందుకే.....నీలో నీ ఆత్మనై  ఉంటా...
ఎవరూ వేరుచేయలేని నీ  ఆత్మనై  ఉంటా......


2 comments:

  1. alaa undagaligede aatma kadaa sir, entha goppa baavana chaalaa baagundi

    ReplyDelete
  2. మీకు నా భావం నచ్చినందుకు ధన్యవాదాలు ఫాతిమా గారూ!
    @శ్రీ

    ReplyDelete