29/02/2012

ముద్దు


అరచేతి మీద ముద్దు...అరవిందం.
నుదిటి మీద ముద్దు... నీలాంబరం.
మెడ  మీద  ముద్దు...ముత్యాలసరం.
కంటి మీద ముద్దు ...కనకాంబరం.
ముక్కుమీద ముద్దు... ముద్ద మందారం.

చెంప మీద ముద్దు...చెప్పదు  అడ్డు
పాదం మీద ముద్దు...పారాణి అద్దు.
చెవి మీద ముద్దు... చెరిపేసే  హద్దు.

తొలిముద్దు... తొలకరి జల్లు.
పాపిటి మీద ముద్దు... పన్నీటి జల్లు.
పెదవి మీద ముద్దు...పులకరింతల హరివిల్లు.
ప్రియమైన ముద్దు....పరవశాల  విరి జల్లు.

ప్రియురాలి ముద్దు... వెన్నెల్లో మల్లెల జల్లు ,
అంతరంగాలలో దాచుకునే...సరసాల విల్లు.
4 comments:

 1. muddu chala mudduga undi saaru.

  ReplyDelete
 2. తొలిముద్దు... తొలకరి జల్లు.
  పాపిటి మీద ముద్దు... పన్నీటి జల్లు.

  ప్రియురాలి ముద్దు... వెన్నెల్లో మల్లెల జల్లు ,
  అంతరంగాలలో దాచుకునే...సరసాల విల్లు.

  సూపర్ అందమైన పదాలతో చాల అందంగా రాసావు , :) అభినందనలు

  ReplyDelete
 3. తొలిముద్దు... తొలకరి జల్లు.
  పాపిటి మీద ముద్దు... పన్నీటి జల్లు.

  ప్రియురాలి ముద్దు... వెన్నెల్లో మల్లెల జల్లు ,
  అంతరంగాలలో దాచుకునే...సరసాల విల్లు.

  సూపర్ అందమైన పదాలతో చాల అందంగా రాసావు , :) అభినందనలు

  ReplyDelete