02/03/2012

అంకితంనీ పెదవుల ఎరుపులో ముంచిన కుంచెతో
నీకు రాసిన ప్రేమలేఖ నచ్చలేదన్నావు......
నీ కాలి పారాణిని అద్దిన వేలితో 
నీకు రాసిన ప్రేమలేఖ సరిగా లేదన్నావు....

నీ చిగురుటధరాలపై
నా నాలుక కొసతో రాస్తే
లేఖలే కాదు ప్రేమకావ్యం రాసినా..
స్వీకరిస్తానన్నావు.

అలాంటి ఎన్నో కావ్యాలని ...
నాకు  పదే పదే అంకితమిస్తానన్నావు...
నాకు పదే పదే అంకితమిస్తానన్నావు....
No comments:

Post a Comment