04/03/2012

నీలో ఇంద్రధనస్సు
నీ నుదిటి కుంకుమ ఎరుపు ఇష్టం.
నీ పెదవి ఎరుపు  ఇష్టం.
నీ చేతి గోరింట ఎరుపు  ఇష్టం.
నీ కాలి పారాణి ఎరుపు ఇష్టం.
నీ సిగ్గు బుగ్గ ఎరుపు ఇష్టం.
నీ కంటి కొలకుల ఎరుపు ఇష్టం.నీ కంటి కాటుకలోని నలుపు ఇష్టం.
నీ నీలి కురులలోని నలుపు ఇష్టం
నీ మేని పసుపు ఇష్టం.
నీ నవ్వుల తెల్లని మెరుపు ఇష్టం.


కంటికి కనిపించేవి ఈ రంగులయితే...
స్నేహం, మమత, సహనం, క్షమ లాంటి 
మనసుకి కనిపించే
రంగులెన్నో ఉన్నాయి నీలో.
వీటన్నిటితో  కలిసిన నీ ప్రేమ....
నాకు ఒక సప్త వర్ణాల ఇంద్ర ధనుస్సు.
నా ప్రేమలో కలిసిన నీ ప్రేమ.....
నాకు ఒక సప్త వర్ణాల ఇంద్ర ధనుస్సు.  
                                                         -----------@శ్రీNo comments:

Post a Comment