04/04/2012

చిత్రమే కదూ!


నీ ప్రేమతో ఉండమంటావ్..
నా ప్రేమే నువ్వంటాను....

నీతో ఉండమంటావ్...
నాలోనే నువ్వున్నావంటాను....

నీ మనసులో ఉండమంటావ్....
నా మనసే నువ్వంటాను....

నీ ప్రాణంలా చూసుకుంటానంటావ్...
నా ప్రాణమే నువ్వంటాను....

నీ నవ్వుల్లో నన్నుండమంటావ్...
నా నవ్వుకి కారణం నువ్వంటాను...
నీ కోసం జీవించమంటావ్...
నా జీవితమే నువ్వంటాను....

నీలో సగం నేనంటావ్...
నాలో 'నాకు' చోటు లేదంటాను....
ఇన్ని భిన్నాభిప్రాయాలున్న
మనం కలిసి ఉండటం చిత్రమే కదూ!!!!!!!


6 comments:

 1. ధన్యవాదాలు పద్మర్పిత గారూ!
  @శ్రీ

  ReplyDelete
 2. ధన్యవాదాలు జలతారువెన్నెలగారూ!
  @శ్రీ

  ReplyDelete
 3. sir deenne bhinnatwamlo eekatwam antaaru, nijamgaa entha baagundo chaalaa baagaa raasaaru.

  ReplyDelete
 4. నా కొత్త కవిత.... భిన్నత్వంలో ఏకత్వాన్ని
  ఈ కవితకి అన్వయించేసారా?..:-)..:-)
  మీ ప్రశంసకి ధన్యవాదాలు ఫాతిమా గారూ!
  @శ్రీ

  ReplyDelete