19/04/2012

ప్రేమ వృక్షంమరుస్థలి లాంటి  నా  మనస్సులో 

'నీ ప్రేమ' అనే బీజం వచ్చి పడింది.


నా ప్రాణ వాయువులతో పెరుగుతూ...
ఊహించనంత  వేగంగా
మొక్కగా, మానుగా...
ఊడల జడలతో...వృక్షంగా ఎదిగింది.


నా తనువు లోని ప్రతి కణాన్ని
శాఖలుగా, ఆకులుగా, పువ్వులుగా, కాయలుగా
మార్చుకుంది.


కాలాల ప్రభావం...
ఋతువుల ప్రభావం..
పడకుండా నిత్యం పచ్చగా కళకళలాడింది.


ఆ ఊడలతో ఊయలలూగాం...
ఆ నీడలలో సయ్యాటలాడాం.


ఓర్వలేని విధి నవ్వులు...
విషపు అమ్ములై  మానుని ఛిద్రం చేసాయి.


విషాగ్ని కీలల్లో వృక్షం దగ్ధమైపోయింది.
ఆ భస్మం గాలిలో కలిసిపోయింది...
ప్రతి కణం ఎక్కడెక్కడో పడుతోంది...
కొత్త ప్రేమలకు జీవం పోస్తోంది...


నిత్యం ఆ జంటలను చూస్తున్నాను,,,
ఆ ప్రేమలలోనే  మన ప్రేమను చూసుకొని
మురిసిపోతున్నాను....


                                                                        @శ్రీ 4 comments:

 1. చిత్రం చాలా చాలా బాగుంది!
  మీ కవిత కూడా బాగుంది.
  ఇలాంటి ఒక చిత్రమే పద్మార్పిత గారి బ్లాగ్ లో చూసాను ఈ మధ్యనే..
  మీరు హారం లో లేరు కదా? అందుకే మీ కవితలు చదవటం లో కొద్దిగా వెనకపడుతున్నాము.
  నేను రోజు చూసేది haaram.com అందులో join అవ్వండి

  ReplyDelete
 2. ధన్యవాదాలు వెన్నెల గారూ!
  పద్మర్పిత గారి బ్లాగ్ లో చూసిన చిత్రం చూసి
  అలంటి చిత్రం కోసం వెదికితే దొరికింది.
  haaram.com లో జత పరిచాను నా బ్లాగ్ ని.
  @శ్రీ.

  ReplyDelete
 3. ee kavitha chaalaa bagundi sir

  ReplyDelete
 4. ధన్యవాదాలు మెరాజ్ గారూ!
  కవిత మీకు నచ్చినందుకు...
  @శ్రీ

  ReplyDelete