21/04/2012

ఓ ఎఱ్ఱబడిన కనుదోయి...ఓ మనసు మరో మనసునడిగింది....
నా మనసున నీవున్నట్లుగా
నీ మనసులో  నేనున్నానా?అని... 

   ఓ చేయి మరో చేతినడిగింది...
   నా చేయి నీకందిస్తే,
   నీ చేయి నాకందిస్తావా?అని...

ఓ పదయుగ్మం మరో పాదాల జంటనడిగింది...
నేను నడిచే దారిలో
జీవితాంతం  నడుస్తావా?అని...

   ఓ గుండె మరో గుండెనడిగింది...
   నా గుండె చప్పుడు
   నీ గుండెల్లో వినిపిస్తోందా?అని...

ఓ ప్రేమ మరో ప్రేమనడిగింది...
నేను నిన్ను  ప్రేమించినంతగా 
నీవు కూడా నన్ను  ప్రేమిస్తున్నావా?అని... 

     ఓ  ఎఱ్ఱబడిన  కనుదోయి... 
     మరొక ఎఱ్ఱని కన్నుల జంటని...
     అమాయకంగా అడుగుతోంది..
     నాలాగే నువ్వు కూడా రాత్రంతా నిదురపోలేదా?అని...

12 comments:

 1. చాలా చాలా చాలా బాగుంది.... :)

  ReplyDelete
 2. ధన్యవాదాలు...
  మానస గారూ!
  మీ బ్లాగ్ ఈరోజే చూసాను..
  మీ హృదయంలో పలికే భావాలను
  చదవడం మొదలెడుతున్నానండీ...
  @శ్రీ

  ReplyDelete
 3. ధన్యవాదాలు...
  వెన్నెల గారూ!
  @శ్రీ

  ReplyDelete
 4. ధన్యవాదాలు...
  వనజ(వనమాలి)గారూ!
  @శ్రీ

  ReplyDelete
 5. ధన్యవాదాలు
  పద్మార్పిత గారూ!
  :)
  @శ్రీ

  ReplyDelete
 6. సరళమైన పదాలతో చిక్కటి భావం

  ReplyDelete
 7. మీ స్పందనకి ధన్యవాదాలు... రవిశేఖర్ గారూ!
  @శ్రీ

  ReplyDelete
 8. ee sandeham prati prema jantalo untundata sir chaalaa andamgaa raasaaru

  ReplyDelete
 9. ఫాతిమా గారూ!
  మీ ప్రశంసకి ధన్యవాదాలు...
  సందేహం ఉంటుందేమోనని నా సందేహం.....
  @శ్రీ

  ReplyDelete