![]() |
మలయ మారుతంలో...
నీ ప్రణయ పరిమళం తప్ప,
నీవు గోచరించవేల?
గలగల పారే సెలయేటిలో...
నీ ప్రేమప్రవాహపు వెల్లువ తప్ప,
నీ రూపు కానరాదేల?
విరబూసిన జాజులలో...
నీ స్నేహసౌరభం తప్ప,
నీ ఉనికి దొరకదేల?
నీలాకాశపు తారామండలంలో...
నీ కంటి వెలుగులు తప్ప,
నీవెక్కడా అగుపడవేల?
వెన్నెలకారు వెన్నెలసోనలో...
నీ నవ్వుల జాబిల్లి తప్ప,
నీ జాడ లేదేల?
వేలుపు... కంటికి కానరాదని తెలిసీ....
రేయింబవళ్ళు నా అన్వేషణ ఆగదేల?
@శ్రీ
కల్పనా ...అది ఒక కల్పనా...మీ కల్పన...అందుకే మీ కంటి కి కానరాదు...
ReplyDeleteLol...బాగుందండి చాలా!
చాలా బాగుంది.
ReplyDeleteమీరు 'కల్పన' అంటారా?
ReplyDelete:)....
మనసున్న ...మనసునున్న కళ్ళకే
కనిపిస్తుందేమో లెండి!
ధన్యవాదాలు వెన్నెల గారూ!
@శ్రీ
ధన్యవాదాలు...మానస గారూ!
ReplyDelete@శ్రీ
వెన్నెలకారు,వెన్నెల సోన
ReplyDeleteమంచి ప్రయోగం.కవిత చాలా బాగుంది సార్.
@సుదర్శన్, హైదరాబాద్.
ధన్యవాదాలు సుదర్శన్ గారూ!
ReplyDeleteవెన్నెలకారు (శరదృతువు) లోనే కదండీ
వెన్నెల అందం....
@శ్రీ
మంచి కవిత. చాలా బాగుంది.
ReplyDeleteధన్యవాదాలు ఫాతిమా గారూ!.
ReplyDelete@శ్రీ