16/05/2012

సూర్యచంద్రులంటే కోపం....
సూర్యుడంటే కోపం....                                                                  చంద్రుడంటే కోపం... 
త్వరగా  వెళ్లిపోలేదని.                                                                  తొందరగా రాలేదని.

కౌముది సమక్షంలో... 
వెన్నెల నలుగు పెట్టుకొని,
వెండి చినుకుల్లో స్నానమాడి 
నీవు నాకోసం వచ్చేది ఈ రాత్రే కదా!

సన్నజాజి పందిరి కింద...  
నీ నవ్వుల పువ్వులు  
నా గుండెను అభిషిక్తం చేసేది  
ఈ నిశలోనే కదా!

తూగుటుయ్యాలపై...
నీ చేతివేళ్ళ
తమలపాకు చిలుకలు...
నా నోట పండి...
నీ అధరాన పగడమయ్యేది 
ఈ రేయి లోనే కదా!

నీ ప్రేమామృత ప్రవాహంలో... 
కాలం క్షణాల్లో కరగిపోయేది 
ఈ రాతిరి లోనే కదా!

అందుకే,
సూర్యుడంటే  కోపం...
వేగంగా వచ్చేసాడని,
చంద్రుడంటే కోపం... 
కనికరం లేకుండా త్వరగా వెళ్లిపోయాడని......
                                                                          @శ్రీ 

18 comments:

 1. wow.nice feeling sri.
  -sampat,indore.

  ReplyDelete
 2. good feeling, keep writing.

  ReplyDelete
 3. రవి పోలేదని కోపమెందుకు? వెన్నెల రాలేదని విరహ తాపమెందుకు ?
  రెంటిని ఆస్వాదించండి ....విష్ణుప్రియ

  ReplyDelete
  Replies
  1. అది అంతేనండి... విష్ణుప్రియా!
   ఇద్దరి మీదా కోపమేనండీ!
   సూర్యునిపై ఒక రకంగా...
   చంద్రునిపై వేరొక రకంగా...
   :-)...@శ్రీ

   Delete
 4. వెన్నెల నలుగు పెట్టుకొని,
  వెండి చినుకుల్లో స్నానమాడి
  మంచి పద ప్రయోగం .విరహ భావనను బాగా పలికించారు.

  ReplyDelete
  Replies
  1. పద ప్రయోగానికి మీరు చేసిన ప్రశంసకి
   ధన్యవాదాలు రవిశేఖర్ గారూ!
   భావాలు మీలాంటి వారికి నచ్చితే
   నాకు మరింత సంతోషమండీ!
   @శ్రీ

   Delete
 5. Nice One... and song kuda super ee song vinagane nachhesindi naaku... ventane lyrics petteshaa sri gaaru

  ReplyDelete
 6. thank you prince...
  mee blog lo lyrics choosi paata vini nenu upload chesukunnaa.
  @sri

  ReplyDelete
 7. వేగం గా వస్తే కోపం,త్వరగా వెళ్ళిపోతే కోపం...ఎలా అండి ఇలా అయితే శ్రీ గారు? కాలం తొందరగా పరుగులు పెడుతుందంది కోప్పడుతున్నారు.Just kidding! కవిత నాకు బాగా నచ్చింది

  ReplyDelete
 8. ఇద్దర్నీ కోప్పడక పొతే మళ్ళీ మీరే 'పక్షపాతం'
  అంటారేమోనని ఇద్దర్నీ కోప్పడ్డానండీ!
  :-)...
  మీరు మెచ్చినందుకు ధన్యవాదాలు వెన్నెల గారూ!
  @శ్రీ

  ReplyDelete
 9. ఆఖరి లైన్లు చాలు.. "మంచి కవిత్వం అని చెప్పడానికి"
  సూపర్బ్.

  ReplyDelete
 10. మీ ప్రశంస కి ధన్యవాదాలు వనజ గారూ!
  @శ్రీ

  ReplyDelete
 11. అయ్యబాబొయి...అర్భుతం..!
  ఆలస్యం గా అయినా ఆస్వాదించగలిగానండీ.........!!
  సూపర్......

  ReplyDelete
 12. :-) ... :-)) సీతగారూ!
  ఇలాంటి ప్రశంసలిస్తే...
  మరి ఆనందం మామూలుగా ఉంటుందా?
  ధన్యవాదాలు మీకు...
  @శ్రీ

  ReplyDelete
 13. krishna reddy from miryalguda.........mee kavitha chala adbhutham ga undhi sri garu...mee kalam ninchi inka aanimuthyalu raalalani korukuntunnanu.....

  ReplyDelete
 14. ధన్యవాదములు కృష్ణారెడ్డి గారూ!
  మీ ప్రశంసకు పులకించిపోయానండీ!
  @శ్రీ

  ReplyDelete