24/05/2012

సప్త పదాల గమనం...

సప్త ఋషుల సంతతి....
లోకాన జన సంద్రం
సప్త సముద్రాల మయం...
మన  భూగోళం.

సప్త వర్ణాల అపురూప దృశ్యం...
ఒక ఇంద్రచాపం.
సప్తాశ్వాల రథ సారథి ఆగమనం...
తూరుపు దిక్కున అరుణం.

సప్త స్వరాల సమ్మేళనం...                                     
సుమధుర సంగీతం.
సప్త తంత్రులపై నీ ప్రేమ విన్యాసం...
నా మానసవీణా వాదనం.

సప్త పదాల గమనం...
నీతో గడిపే అందమైన జీవితం,
ఎన్నటికీ వాడని దివ్య కుసుమం,
ఏ జన్మకీ  మరువలేని మధుర  స్వప్నం......

                                                              
                                                              @శ్రీ               

19 comments:

  1. చాలా బాగుంది.. శ్రీ గారూ

    ReplyDelete
  2. మీకు కవిత నచ్చినందుకు ధన్యవాదాలు మానస గారూ!
    @శ్రీ

    ReplyDelete
  3. sree garu,saptha bhaavaala sangamam mee kavitha. preminche premava paata baagundi

    ReplyDelete
    Replies
    1. మీ ప్రశంస కి,
      పాట నచ్చినందుకు
      ధన్యవాదాలు ఫాతిమాగారూ!
      నా కవితలో సప్త భావాలను చూసారంటే...
      ఆనందంగా ఉందండీ! :-)
      @శ్రీ

      Delete
  4. Never realized that number "7" has so much significance! Nice poem andi!
    నిజం చెప్పండి, ఎప్పుడు రాసారు ఈ కవిత?ఇప్పుడేనా, లేక గతం లో రాసారా?

    ReplyDelete
  5. (seven notes make music
    seven letters make 'friends')
    ఈ పై మెసేజ్ మా ఫ్రెండ్ పంపించాడు...
    google transliteration లో టైపు చేస్తూ పొతే
    అలా ఓ కవిత తయారైపోయింది...
    అంతే! ఆలస్యం చేయకుండా చిత్రాన్ని వెదికి బ్లాగ్ లో పెట్టేసాను...
    కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదాలు....

    వెన్నెల గారూ! మీకెందుకండీ ఆ సందేహం వచ్చింది?
    ఇప్పటిదా? గతంలోదా? అని....
    (పురాణాల్లో వంది-అష్టావక్రుల సంవాదం నాకు బాగా గుర్తు
    అందులో
    వంది :
    గ్రామ్య పశువులు ఏడు.
    అడవి పశువులు ఏడు
    ఋషుల సంఖ్య ఏడు
    వీణకి తీగెలు ఏడు.
    యజ్ఞం వహించిన ఛందస్సులు ఏడు ....
    అంగాలు ఏడు...రాజు -మంత్రి-మిత్రం-కోశం-రాష్ట్రం-దుర్గం-సైన్యం.)

    ReplyDelete
    Replies
    1. అమ్మో! "7" సంఖ్య కి ఇంత చరిత్రా? వారం లో రోజులు కూడా ఏడే కదా!!!

      Delete
    2. సప్త ద్వీపాలు(ఏడు)
      సప్త మాతృకలు (ఏడు) -- ((కుమార స్వామిని చూసిన వారు ))
      ఊర్ధ్వలోకాలు ఏడు..
      అథో లోకాలు ఏడు...
      అద్భుతాలు పాతవి ఏడు
      అద్భుతాలు కొత్తవి (వింతలు) ఏడు
      చొక్కాకి బటన్స్ ఏడు( :-))))))) )
      కారాగారం తలుపు ఊచలు ఏడు(ఎక్కడో విన్నాను. ఖచ్చితంగా తెలీదు)
      ఆఖరికి మనిషి అంతిమ యాత్రలో కట్టే కట్లు ఏడు.....

      *** మీరన్నట్లుగా వారానికి ఏడు రోజులనేవి వంది-అష్టావక్రుల కాలంలో లేవు...
      మామూలుగా మన ఇప్పటి లిస్ట్ లో అయితే ఉన్నాయి.
      అలాగే సప్త ద్వీపాలు ఎందుకు చెప్పలేదా వంది ?అని ఇప్పటికీ అనుకుంటుంటాను...
      ఇంకా తెలియనివి ఉన్నాయేమో!
      మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు వెన్నెల గారూ!
      @శ్రీ

      Delete
    3. Oh..సంఖ్య "7"..తుస్సి గ్రేట్ హో!

      Delete
  6. thank you prince for the compliment made for me...
    @sri

    ReplyDelete
  7. సప్త భావ కవితా విన్యాసం బావుంది. చాలా చక్కని పాటని జత చేసి అందించారు కాబట్టి ఇంకా ఇంకా బావుంది.

    ReplyDelete
  8. సప్తాహాంతపు (week end) రోజున ..
    మీ ప్రశంస కి
    చాలా ధన్యవాదాలు వనజ గారూ!
    @శ్రీ

    ReplyDelete
  9. mee yedu prema bhagundi sir, keep writing.

    ReplyDelete
    Replies
    1. సప్త వ్యసనాలు
      ఉన్నాయండోయ్...
      మీకు నచ్చినందుకు ధన్యవాదాలు...
      @శ్రీ

      Delete
  10. ఏడేడు లోకాల విశేషాలను చెప్పేరుగా...కవిత బావుంది,

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు జ్యోతిర్మయి గారూ!
      మీకు కవిత నచ్చినందుకు...
      మీ బ్లాగ్ ఈ మధ్యనే చూసాను...
      మొత్తం అన్నీ చదవాలండీ...
      మీ ఆర్టికల్స్ ప్రస్తుతీకరణ బాగుంటుంది,,,
      @శ్రీ

      Delete