11/06/2012

ముద్దాడుతున్నాయి మరి....


  

నా  పేరు 
"పవన్ ,
ఫాల్గున్, 
బాలు, 
భార్గవ్, 
మురళి "
వీటిల్లో  ఏదీ కాలేదు ఎందుకో???

నా పేరు మార్చేసుకుందామని  ఉంది .
ఎందుకంటావా ?

ఆ  పేర్లు  పలికిన ప్రతీ సారీ 
ఆ పేర్లలోని మొదటి  అక్షరాలు 
నీ  పెదవులను  ముద్దాడుతున్నాయి మరి...


..............
.........
............
..........

(కవిత చదివిన ప్రతి వారూ ఒక్కసారి ఈ పేర్లు పలికి చూస్తారు)
:-)....:-).....:-).......:-) :-)....:-).....:-).......:-):-)....:-).....:-).......:-)20 comments:

 1. శ్రీ గారూ, కవిత పెట్టారా శాపం పెట్టారా? ఏ పేర్లకు పెదవులు కలుస్తాయి , వేటికి కలవవో చూడటం సరిపోతుంది. సరదాగా అన్నాను, బాగుంది మీ బుజ్జి కవిత.

  ReplyDelete
  Replies
  1. మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ!
   అన్నట్లు మీ పేరులో మొదటి అక్షరం "మ"
   అనుకుంటాను....:-))
   @శ్రీ

   Delete
 2. శ్రీనివాస్ గారు....నన్నూ పేరు మార్చుకోమంటారా మరి....
  బాగుంది...
  :)

  ReplyDelete
  Replies
  1. సాయి గారూ!
   ఇలా మీరుకూడా పోటీకి వస్తే ఎలా చెప్పండి???..:-))
   చిట్టి హాస్య కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదాలు...
   @శ్రీ

   Delete
 3. Replies
  1. ఇకనుంచి మీ పేరు,
   మీ బ్లాగ్ పేరు ...
   పలికే వారిని చూసి చిరునవ్వులు చిందిస్తారు మీరు...:-))
   @శ్రీ

   Delete
 4. "శ్రీ"గారు పేరు మార్చుకుందామనుకుంటున్నారా?
  అలాంటివి జాంతానహీ జాగ్రత్త:-):-):-)

  ReplyDelete
  Replies
  1. ఎంత మీ పేరు,
   మీ బ్లాగ్ పేరు 'ప' తో మొదలైతే మాత్రం...
   నా పేరు మార్చుకోవద్దనడం అన్యాయం కదూ!:-))...:-))
   @శ్రీ

   Delete
 5. Replies
  1. no problem aniket...
   i am with you....:-)
   thank you for ur compliment
   @sri

   Delete
 6. శ్రీ గారూ.....
  పేరు మార్చుకోవడం కుదరదు.......!!!
  :) :)
  బాగుంది మీ కవిత
  --సీత

  ReplyDelete
  Replies
  1. అమ్మో!
   ఇంతమంది వద్దంటున్నారు కాబట్టి మార్చుకోనులెండి...
   ఇంకో బ్లాగ్ మొదలు పెడదామనుకున్నాను...
   అక్కడ వాడుకుంటాలెండి...:-))
   కవిత నచ్చినందుకు ధన్యవాదాలు మీకు..
   @శ్రీ

   Delete
 7. హమ్మయ్యా! పేరు మార్చేసుకోండి! మీకు , నాకు ఇంక clash ఉండదు! తెలుసు కదా ఆ రహస్యం . అందరు మిమ్మల్ని పేరు మార్చుకోవద్దన్నారు. నేను మాత్రం మార్చేసుకోండంటున్నాను! :))

  ReplyDelete
  Replies
  1. సమస్య లేదు....
   మార్చుకోను గాక మార్చుకోను....:-)
   "శ్రీ " అనే సంయుక్తాక్షరానికి ఉన్న అర్థాలు బహుశా ఏ అక్షరానికీ లేవే మో!(అనుకుంటున్నాను)
   శబ్ద రత్నాకరం తీయకండీ! :-)
   నా పేరంటే నాకు చాలా ఇష్టమండీ!
   చిన్నగా పెదవులు తెరిచి.... చిరునవ్వుతో.... పలువరుస కనిపిస్తూ.... పలికే పేరు 'శ్రీ'
   (u can check it)
   అంచేత ఈ పేరే ఖాయం...:-)
   అయినా మీ బ్లాగ్ పేరు ఓ సారి మళ్ళీ చూసుకోండి...:-))
   @శ్రీ

   Delete
 8. బగేశ్రి ---- name of a రాగ
  పూర్వి --- a classical మెలోడి
  పరిత --- Kunti, mother of పాండవాస్
  ముద్దాడని పెదవుల గురించి ఎప్పుడు వ్రాస్తారో ....@krishnapriya

  ReplyDelete
 9. ప, ఫ, బ, భ, మ
  లతో పలకని వన్నీ
  ముద్దాడని పెదవులతో పలికేవే...
  కృష్ణ ప్రియ గారూ!
  :-))....:-))...
  @శ్రీ

  ReplyDelete
 10. భలేగా ఉంది మీ కవిత...:)

  ReplyDelete
 11. ధన్యవాదాలు కరుణ గారు...:-)...@శ్రీ
  ఎప్పుడో చిన్నప్పుడు చదివిన చిన్న భావం ఆధారం...

  ReplyDelete