17/08/2012

లోహ విహంగాల చప్పుడు...



లోహ విహంగాల చప్పుడు బాల్యంలో చాలా యిష్టం...
ఆకాశంలో కదలని రెక్కలతో వేగంగా ముందుకు
దూసుకుపోతుంటే చూడటం ఎంతో యిష్టం...
అంతా నా వంకే చూస్తున్నారనే భ్రమతో 
చేతులు ఊపుతూ చూడటం మరీ ఇష్టం...

పరుగులు పెట్టి బైటికి వచ్చి 
ముందు నేనే చూడాలని,
అందరికీ నేనే చూపాలనే ఉత్సాహం.
తర్వాత పడే బెత్తం దెబ్బలు సైతం 
లక్ష్యం చేయనని  మొండితనం.

ఇష్టం పెరిగింది వయసుతో...
అదే ఉత్సాహం పిల్లలలో...
వారిలో నన్ను నేను చూసుకుంటూ...
అదే ఉత్సాహం...అంతే ఆనందం..

రెక్కలొచ్చిన  పిల్లలు గూడు వదిలి
అదృశ్యమయ్యారు 
ఆ విహంగాల హోరులో...

రాలేరు  వెనుదిరిగి
డాలర్ల మోజు తీరకుండా...
కాలేరు దూరం 
పబ్బుల కల్చరు నుంచి..
బైట పడలేరు 
కేసినోల వలనుంచి....


సంక్రాంతి  లేదు ,ఉగాది లేదు...
దసరా, దీపావళి తెలియనే లేదు...
పలకరింపుకి సమయం లేదు...
మెయిలు తప్ప మాట లేదు...

ఇపుడు కూడా 
ఆ విహంగాల చప్పుడు అంతే ఇష్టం...
ఇప్పుడు కాక పోయినా ,
ఎప్పటికైనా... 
వారిని తిరిగి తెచ్చేది ఆ చప్పుళ్ళేననే ఆశతో...















24 comments:

  1. ఇప్పుడుకూడా ఆ చప్పుళ్ళంటే ఇష్టమని ఎంత బాగాచెప్పారండి! అభినందనలు....

    ReplyDelete
    Replies
    1. పద్మ గారూ!
      మీ అభినందనలకి, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు..
      @శ్రీ

      Delete
  2. ఇప్పుడు కాక పోయినా ,
    ఎప్పటికైనా...
    వారిని తిరిగి తెచ్చేది ఆ చప్పుళ్ళేననే ఆశతో...

    అవునండీ... లోహవిహంగాలు..మనుషులని విడదీస్తాయి.. కలుపుతాయి..

    బాగా వ్యక్తీకరించారు.

    ReplyDelete
    Replies
    1. వనజ గారూ!
      అంతేనండి..మీరు చెప్పిన భావమే కవితా సారం...
      ధన్యవాదాలు మీ స్పందనకు.
      @శ్రీ

      Delete
  3. శ్రీ గారూ, మొదటగా కవిహృదయానికి అభినందనలు.
    కవిగా అన్ని భావనలను పలికించగలగటమే కావ్యానికి సార్ధకత.
    ఓ వృద్దుడు తన బిడ్డలకోసం పడే తపన మీ కలం పలికింది.
    సర్, ఇలా విలక్షణమైన , స్పష్టమైన భావాలను పలికే కవితలు రాయండి ,

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారూ!
      ధన్యవాదాలు మీ ప్రశంసకి...
      విదేశాలకి వెళ్ళిపోయి తల్లిదండ్రులను పట్టించుకోని
      వారి గురించే ఈ కవిత....
      మీ సూచనకు మరో సారి ధన్యవాదాలు...
      @శ్రీ

      Delete
  4. లోహపు విహంగాలు గట్టివే అయినా మనసున్న మనుషుల్ని వారి మమతల్ని విడదీయలేవులెండి!

    ReplyDelete
    Replies
    1. ప్రేరణ గారూ!
      మీరన్నది నిజమే...
      మనసులేని మనుషుల గురించి...
      మనసున్న మనిషి పడే వేదన ఇది...
      ధన్యవాదాలు మీ స్పందనకు...
      @శ్రీ

      Delete
  5. రెండేళ్ళకో మూడేల్లకో ఒక సారి వచ్చి చూస్తున్నారు లెండి.వృద్ధాప్యం లో ఉన్న తల్లిదండ్రులకు తీరని శోకమే విభిన్నమైన అంశం.

    ReplyDelete
    Replies
    1. రవి శేఖర్ గారూ!
      మీరన్నది నిజమే..
      వాళ్ళు రాకపోవడం ఒక పార్శ్వమైతే ..
      (విబ్భిన్న కారణాల వలన)
      వాళ్ళు వీరిని అసలు పట్టించుకోకపోవడం
      బాధాకరమైన విషయం...
      మీ స్పందనకు ధన్యవాదాలు...
      @శ్రీ

      Delete
  6. లోహవిహంగాలే కాదండీ దూరమైన బిడ్డల కోసం కన్నవాళ్ళని
    ఆశతో ఎదురుచూసేలా చేయగల లోహపు మనసులు కూడా ఉన్నాయి..

    లోహవిహంగాల చప్పుళ్ళు తెచ్చే సంతోషంతో పాటూ
    వాటి వెనక వున్న బాధాకరమైన ఎదురుచూపులను గురించి కూడా చాలా బాగా చెప్పారు..

    మంచి ఆలోచన

    ReplyDelete
    Replies
    1. రాజి గారూ!
      సరిగా విశ్లేషించారు కవితాభావాన్ని...
      అలాంటి లోహమనస్కుల గురించే వ్రాసానండి...
      ధన్యవాదాలు మీ చక్కని స్పందనకు...
      @శ్రీ

      Delete
  7. Sri Gaaru Chala Bagundi...

    Andi Naa Gurinchi Vrasaru Emo Anukunnanu...

    Bale Vrasaru Andi Meeru Roju Rojuki Chinna Pillalla Maari Potunnaru...

    Inka Emiti VisyaluAndi Bagunnaraa...

    Kocham Work Lo Busy Vallaa friends Andarini Miss Aipotunnanu


    Song Bagundi Andi Manchi Song Pettaru

    ReplyDelete
  8. ధన్యవాదాలు ప్రిన్స్...
    ఎక్కడా నా బ్లాగ్ లో ఐదారు పోస్టులనుంచి
    కనిపించడం లేదేమిటా అనుకున్నాను...
    పనిలో బిజీ అన్నమాట...:-)
    పాట నచ్చినందుకు...
    కవిత నచ్చినందుకు...
    ఆత్మీయమైన మీ పలకరింపుకు...
    ధన్యవాదాలు...:-)
    @శ్రీ

    ReplyDelete
  9. పాట బాగుంది శ్రీ గారు!
    ఇక మీ కవిత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

    ప్రపంచం తో పోటీ పడి, జయించాలనే కోరిక, ఆశయం కోసం, యువతకి లోహ విహంగం ఎక్కాల్సి వస్తోంది. (అయిష్టంగానే) :)


    ReplyDelete
  10. ధన్యవాదాలు హర్షా మీ ప్రశంసకి...
    మీరన్నది నిజమే...పోటీ తత్వంతో విదేశాలకే కాదు
    చంద్రమండలానికి కూడా ఎగరాలి...
    కానీ వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న,
    ఆర్ధికంగా ఆధారపడిన
    తల్లిదండ్రులని విస్మరించరాదని నా భావం
    అంతే...
    @శ్రీ

    ReplyDelete
  11. వుండండి వినీలాకాశంలో విహంగ సభ్దం వినబడుతోంది

    చూసోస్తాం...కృష్ణ,సందీప్

    ReplyDelete
  12. అన్నట్టు మీ కవిత బాగుంది.......సందీప్

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సందీప్!
      కవిత నచ్చినందుకు...
      @శ్రీ

      Delete
  13. అలాగే చూడండి...
    ఆ వెనుకే నాకవిత కూడా కనిపిస్తుంది....:-)
    ధన్యవాదాలు మీ స్పందనకి..
    సందీప్,క్రిష్ణ....
    @శ్రీ

    ReplyDelete
  14. చక్కగా రాశారండి, నేను ఎక్కలేదండి ఎప్పుడు, మీ లోహవిహంగాన్ని.....

    ReplyDelete
  15. మీప్రశంసకి...
    ధన్యవాదాలు భాస్కర్ గారూ!
    లోహవిహంగం ఎక్కే అవకాశం వస్తుంది లెండి...:-)
    @శ్రీ

    ReplyDelete
  16. వావ్! చాలా బాగా చెప్పారండీ రెండు బాల్యాల గురించీ (వృద్ధాప్యం రెండవ బాల్యం అన్నారు కదా!)

    ReplyDelete
  17. ధన్యవాదాలు రసజ్ఞ గారూ!
    మీ ప్రశంసకి...
    @శ్రీ

    ReplyDelete