దుఃఖం... నిన్ను దాచాలంటే
అందరికీ సాధ్యం కాదని
తెలుసు...
పెల్లుబికే ఉప్పెనను
రెండుకళ్ళలో
దాచటం అంటే మాటలా?
బిందువులో సింధువును
చూపడం సులువే గానీ
గుప్పెడంత గుండెలోని
శోకాన్ని
ఆల్చిప్పలాంటి ఆ కళ్ళలో దాచటం ఎంత కష్టం?
ఆనందబాష్పాలు చిందిస్తే
బుగ్గల మీద జారిన
కన్నీటి చుక్కలు సైతం
వెండి తళుకులతో మెరుస్తూ
ఆనందాన్ని ప్రతిఫలిస్తాయి...
కాంతిని విఫలం (వక్రీభవించి)
చేసి
సప్తవర్ణాలను వెదజల్లుతాయి.
వేదనతో, ఆవేదనతో
ఆ కళ్ళు వర్షించే
ఆమ్లధారల ధాటికి
లేత గులాబి బుగ్గలపై
ఎప్పటికీ మిగిలిపోయే
చారికలుగా నిలిచిపోతాయి...
ముఖాన్ని...
కృత్రిమముఖంలో
దాచేసుకున్నా
ఆ ముఖం పైన కూడా
నీ అవశేషాలు
స్పష్టంగా కనిపిస్తూనే
ఉంటాయి...
మనస్సంద్రంలో
నిలువెత్తు కెరటాలతో ఎగసిపడే
దుఖాన్ని వర్షించాలంటే
వేయి కళ్ళు కావాల్సిందే...
వేలనదులై పారాల్సిందే...
నిన్ను నా చిరునవ్వులో
దాచే ప్రయత్నం చేస్తూనే ఉన్నా,
ఆ చిరునవ్వునే కన్నీరు
కార్పించే శక్తి
నీకు ఎవరిచ్చారో?
తేలిక పదాలతో భారమైన భావాన్ని పలికించారు..
ReplyDeleteచాలా బాగుంది..శ్రీ గారు..
ధన్యవాదాలు ధాత్రి గారూ!
Deleteమీరు కవితని మెచ్చినందుకు
నా బ్లాగ్ కు స్వాగతం....@శ్రీ
"నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి..ఏ కన్నీరెనకాల ఏముందో తెలుసుకో"
ReplyDeleteనిజంగా వేదనైనా, ఆనందమైనా దుఖాన్ని దాచలేము కదండీ..
చాలా బాగుంది శ్రీ గారు...
ధన్యవాదాలు రాజి గారూ!
Deleteమీరన్నది నిజమే...
మీకు నా భావం నచ్చినందుకు...@శ్రీ
దుఃఖాన్ని దాస్తే అది ఇంకా భారం
ReplyDeleteఅయినా ఆగమంటే ఆగేనా కన్నీళ్ళు!!!
చాలా బాగుందండి.
పద్మగారూ!...
Deleteకన్నీటిని ఆపితే...
గుండెలో ఉప్పెనను తట్టుకోవడం కష్టం....
ధన్యవాదాలు మీ ప్రశంసకు...@శ్రీ
బాగుంది శ్రీ గారూ. ముగింపు లైన్లు బ్రహ్మాండం...
ReplyDeleteధన్యవాదాలు చిన్ని ఆశ గారూ!...
Deleteమీకు నచ్చినందుకు....
దుఖం హద్దులు దాటితే చిరునవ్వును కూడా కన్నీరు కార్పిస్తుంది కదా!...
మీ ప్రోత్సాహం నాకెప్పుడూ కొత్తవి వ్రాసేందుకు తోడ్పడుతుంది...@శ్రీ
sad but true.
ReplyDeleteyes yohanth u are right...
Deletesome feels will be painful...
but in certain circumstances we can't avoid them....
thank you very much for ur compliment...@sri
చాలా బాగుంది..శ్రీగారు
ReplyDeleteధన్యవాదాలు అనికేత్...మీకు కవిత నచ్చినందుకు... మీ ప్రశంసకు ....@శ్రీ
Deleteనిన్ను నా చిరునవ్వులో
ReplyDeleteదాచే ప్రయత్నం చేస్తూనే ఉన్నా,
ఆ చిరునవ్వునే కన్నీరు కార్పించే శక్తి
నీకు ఎవరిచ్చారో..........
same question nenu naa priyuraalini adugutune untaanu...
very nice sree gaaru
పండు గారూ! ధన్యవాదాలు మీ ప్రశంసకు...
Deleteఅది ప్రశ్న కాదు...నిజమైన దుఖానికి అంత శక్తి ఉంది....@శ్రీ
శ్రీ గారూ, బాదని కన్నులలొ దాచలేమని కవితలొ చక్కగా తెలిపారు. అద్భుతమైన శైలి
ReplyDeleteమేరాజ్ గారూ!...మీకు బ్లాగ్ ఓపెన్ అయిందన్నమాట....ధన్యవాదాలు మీ ప్రశంసకు....@శ్రీ
Deleteఅద్భుతం....!!!
ReplyDeleteనిజమే కదా ఆనందాన్ని..ధుఖాన్ని..కట్టిపడేయలేము అణచుకొన్నా
ఆగేదికాదు సునామిలా పెల్లుబికి వచ్చేవే..ఈ రెండు.
చాలా బాగా రాసారండీ..థాంక్స్ శ్రీ గారు :
ధన్యవాదాలు ప్రియ గారూ!...
ReplyDeleteఅవునండీ...రెంటినీ ఆలేము ఆపాలనుకున్నా...
మీ అభినందనలకు మరోసారి ధన్యవాదాలు....@శ్రీ