31/07/2013

శాకుంతలం-3






నాలుగు వైపులా హోమాగ్నులు 
వేదమంత్రాల ప్రతిధ్వనులు 
ఆజ్యాల సుగంధాలు 
హవిస్సులు అందుకొనే దేవతలు.

మరుమల్లెల సుగంధాలు ఒక ప్రక్క 
విరజాజుల పరిమళాలు వేరొక ప్రక్క 
సంపెంగల సౌరభాల ఆహ్లాదం 
పున్నాగల పలకరింపుల ఆహ్వానం 

అటునిటు పరుగులెత్తే శశకాలు 
చెంగు చెంగున గెంతులేసే హరిణాలు
మయూరాల క్రీంకారాలు 
శుకపికాల కలరవాలు
ఇవే కణ్వుని ఆశ్రమంలోని దృశ్యాలు 

అతిశయించిన సౌందర్యంతో 
ముని కన్నెల మధ్య శకుంతల. 
పారిజాతమాలికలు  సిగలో చేరితే 
మల్లెలదండలు కరమాలలైనాయి.
గరికపూలు గళసీమను కౌగిలించాయి. 
తెల్లచేమంతులు చెవికి భూషణమైనాయి

వనజీవులతో వార్తాలాపాలు
సఖులతో సరదాల ఆటలు
మాధవీలతలతో స్నేహాలు
మొక్కలతో ముచ్చట్లు 
మునులకు సుశ్రూషలు
ఇవే మేనకా విశ్వామిత్రుల తనయ దినచర్యలు 

  





















6 comments:

  1. కణ్వుని ఆశ్రమ వర్ణన కళ్ళకు కట్టినట్టు వర్ణించారు శ్రీ జీ....... చాలా బావుంది

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శ్వేత గారు మీ మెచ్చుకోలుకు...@శ్రీ

      Delete
  2. మునివాటిక కనిపించింది

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శర్మ గారు నాకవితలో వర్ణించిన దృశ్యం కంటికి కనబడితే ధన్యుడను ...@శ్రీ

      Delete
  3. చదూతుంటే ఎదో తెలియని పదాల నాట్యం తొణికిసలాడింది పెదవుల పైనా, మదిలోపలా...
    శాకుంతలాన్ని కవితలో అంటే ఇలానే చెప్పాలి అన్నట్టుంది మీ కవిత.
    ఫేస్ బుక్ లోకం నుంచి అప్పుడప్పుడూ ఇలా బ్లాగ్ లోకానికీ మీ కవితాఝురి ని పంపండి "శ్రీ" గారూ ;)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు చిన్ని ఆశ గారు ...మీ ప్రశంసకి బోలెడు ధన్యవాదాలు ...తప్పకుండా ...కవితలన్నీ పుస్తకరూపంలో తెచ్చే ప్రయత్నంలో ఉన్నాను .... @శ్రీ

      Delete