04/08/2013

|| e- స్నేహం ||






నిన్ను మునుపెప్పుడూ చూడలేదు 
ఎప్పుడూ మాట్లాడలేదు 
స్నేహమంటూ ఒకనాడు చేయి చాపావు 
చేయి కలుపుతూ సరేనన్నాను
నువ్వు థాంక్స్ అన్నావు
నేను వెల్కమ్ చెప్పాను

ఆత్మీయంగా రోజూ పలకరింపులు
శుభోదయాలు శుభరాత్రులు
పండుగలప్పుడు శుభాకాంక్షలు
పబ్బాలప్పుడు గ్రీటింగు కార్డులు

బాల్య స్నేహితులు గుర్తుకి రావడం లేదు
కాలేజ్ దోస్తీలు మరచిపోయాను
స్నేహంలోని ఆత్మీయతలలో కొట్టుకు పోతున్నా
అందులోని ఆప్యాయతలలో తేలిపోతున్నా
'e'- స్నేహాల వెల్లువలో మునిగిపోతున్నా

ఒక్కొక్కరినీ ప్రత్యక్షంగా కలుస్తుంటే
అనిపిస్తోంది ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్లే
వినిపిస్తోంది ప్రతి మదినుంచీ స్నేహగీతం.
దినదినం వర్ధిల్లుతోంది మీతో ఈ అంతర్జాల స్నేహం... ...@శ్రీ 03/08/2013

(నేస్తాలూ కాదంటారా? ఈ అనుభవం చాలా మందికి అవుతోందని అనుకుంటున్నాను.
నాతో చక్కని ఆరోగ్యకరమైన స్నేహాన్ని కొనసాగిస్తున్న నా అంతర్జాల స్నేహితులందరికీ
ప్రేమతో ఈ కవితా కానుక ...@శ్రీ )....

14 comments:

  1. జై జై e స్నేహం. మిత్రదినోత్సవ శుభకామనలు.

    ReplyDelete
    Replies
    1. మీకు కూడా శుభాకాంక్షలు శర్మ గారు ...నమస్సులతో ...@శ్రీ

      Delete
  2. e-స్నేహం...శ్రీ స్నేహం. మిత్రోత్సవ శుభాకాంక్షలు!

    ReplyDelete
    Replies
    1. మీకు కూడా స్నేహితుల రోజు శుభాకాంక్షలు చిన్ని ఆశ గారు ...ధన్యవాదాలతో .@శ్రీ

      Delete
  3. చాలా బాగుంది :)

    ReplyDelete
    Replies
    1. నీకు కూడా స్నేహితుల రోజు శుభాకాంక్షలు హర్షా ...ధన్యవాదాలతో .@శ్రీ

      Delete
  4. Replies
    1. happy friendship day మీకు కూడా అనికేత్ గారు ...@శ్రీ

      Delete
  5. e-స్నేహం నాకూ నచ్చింది.
    మీ కవిత ఎంతో బాగుంది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు పద్మ గారు .ఈ "e-స్నేహం" ..మీ స్నేహాన్ని అందించింది ...:-)..@శ్రీ

      Delete
  6. చాల బాగుంది

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శంకర్ గారు ....మీకు కూడా స్నేహితుల రోజు శుభాకాంక్షలు

      Delete
  7. Replies
    1. ధన్యవాదాలు చిన్ని గారు ...మీకు కూడా స్నేహితుల రోజు శుభాకాంక్షలు

      Delete