నీ అలుకకి కూడా అలుకట
నిన్ను త్వరగా ప్రసన్నం చేసుకోలేదని.
నీఅలుక నాకు అపురూపమే
అలుకలో నీ అందం కెందామరకి ప్రతిరూపమే.
అక్షరాలన్నీ పోటీ పడుతున్నాయి
నీవైన నాకైతలనలంకరించాలని
భావచందనాన్ని పూసుకొని
నవ పరిమళాలను వెదజల్లుతున్నాయి
నీ అందాలనుకప్పే భావాంబరానికి
తళుకులద్దాలని తొందరపడుతున్నాయి
ప్రతీ భావనర్తనానికీ
మురిపించే మువ్వలౌతున్నాయి
కళ్యాణ తలబ్రాలు కావాలని
పసిడి రంగు పూసుకుంటున్నాయి
భావాలన్నీ కొత్తకోకలు కట్టుకుంటున్నాయి
నీ మెప్పుపొందాలని.
కాముని శరాలని తోడు తెచ్చుకుంటున్నాయి
కలహమింకచాలించమని
అలుక తీరిన తదుపరి క్షణాలు తలచుకొని
సిగ్గిల్లుతున్నాయి
గమనంలో వయ్యారాలు చూపుతూ
సెలయేటి నడకలను తలపిస్తున్నాయి
నీ సౌందర్యాతిశయాలకు
అక్షర హస్తాలతో మోకరిల్లుతున్నాయి...@శ్రీ .
చక్కటి భావుకత. చాల బాగుందండి.
ReplyDeleteధన్యవాదాలు భారతి గారు మీ ప్రశంసకి ...@శ్రీ
Deleteఅందమైన అక్షరాలతో అలుకతీరుస్తారని అలుకకి కూడా అర్థమైనట్లుంది, అందుకే అలిగింది "శ్రీ"గారు ;-)
ReplyDeleteఅలాగంటారా ...ధన్యవాదాలు పద్మ గారు మీ ప్రశంసకి...@శ్రీ
Deleteచాల బాగుందండి. Image inka super:-))
ReplyDeleteధన్యవాదాలు శృతి గారు మీ ప్రశంసకి...@శ్రీ
Deletenice
ReplyDeleteధన్యవాదాలు ప్రిన్స్ ...@శ్రీ
DeleteBeautiful!
ReplyDeleteపుస్తక రూపంలోనూ మరి మీ కవితన్నీ మదివిందు చెయ్యనున్నాయనమాట!
చిన్ని ఆశ గారు ..ఏక వాక్య కవితల పుస్తకం ఈ నెలాఖర్లో రావచ్చు బహుశా ...
Deleteధన్యవాదాలు మీ ప్రశంసకి...@శ్రీ
శ్రీనివాస్ గారు, ఫేస్‌బుక్ లో తెలుగు రచనల కోసం చూస్తుంటే మీ పేజ్ కనిపించింది. చాలా ఆసక్తిగా అనిపించింది. ఎంతో వైవిధ్యంగా ఉన్నాయి మీ ఫేస్‌బుక్ పేజీలూ. ఇంతకూ మీరు కవా, రచయితా, చిత్రకారులా, ఫోటోగ్రాఫరా? మీ ఆసక్తి అభిరుచి చాలా అభినందనీయం.
ReplyDelete