13/11/2013

|| మనదనుకున్న మన మనసే (మనిషే) ||


1.ప్రేమలో పడితే

గాలిలో రెక్కలు లేకుండా తేలడమే.
మనసుని తేనెలో ముంచి తీయడమే
సంద్రంలో ఈత రాకున్నా ముందుకెడుతున్నట్లనిపించడమే

2.ప్రేమ దూరమైతే

కత్తుల వంతెనపై పాదాలు మోపినట్లుంటుంది
నిప్పుల ఉప్పెన తరుముకొస్తున్నట్లనిపిస్తుంది
రెప్పలు మూతపడక నిద్ర దూరమౌన్నట్లుంటుంది

3.దూరమైన ప్రేమను తలుస్తుంటే

దగ్గరైనా దూరమైనా ప్రేమే దైవమని నమ్మాలంటుంది
వియోగం త్వరలో తీరే ఆశ కనబడుతూ ఉంటుంది.
ప్రతి విషయం ధనాత్మకంగానే అనిపిస్తుంది.
ఎడారిలో ఒయాసిస్సుల ఉత్సవమనిపిస్తుంది
నిశీధిలో సిరివెన్నెల నాట్యం కనబడుతుంది
శిశిరంలో వసంతాల వెల్లువనిపిస్తుంది
అన్వేషిస్తున్నది త్వరలోనే దొరికిపోతుందనిపిస్తుంది

4 ప్రేమ బాధిస్తుందా?

ప్రేమకి ఆనందం పంచడమే తెలుసు
ప్రేమకి ప్రేమను అందించడమే తెలుసు
వరుసలో మనవంతు వచ్చేదాకా వేచి ఉండలేకపోవడం...
బాధకి కారణం ప్రేమే అని నిందించడం
బాధించేది మన మనసే ..మనదనుకున్న మన మనిషే... @శ్రీ 

2 comments:

 1. కత్తుల వంతెనపై పాదాలు మోపినట్లుంటుంది
  నిప్పుల ఉప్పెన తరుముకొస్తున్నట్లనిపిస్తుంది
  రెప్పలు మూతపడక నిద్ర దూరమౌన్నట్లుంటుంది

  nice lines sree garu

  ReplyDelete
 2. ప్రేమకి ఆనందం పంచడమే తెలుసు
  ప్రేమకి ప్రేమను అందించడమే తెలుసు
  వరుసలో మనవంతు వచ్చేదాకా వేచి ఉండలేకపోవడం...
  బాధకి కారణం ప్రేమే అని నిందించడం
  బాధించేది మన మనసే ..మనదనుకున్న మన మనిషే.....చాలా చక్కగా చెప్పారు శ్రీగారు...బాధకి కారణం ప్రేమ ఎప్పటికీ కాదు..కాకూడదు. చాలా బాగుంది. (y). :)

  ReplyDelete