20/09/2016

|| శాంతికపోతాలెపుడూ ఎగురుతూనె ఉండాలీ - తెలుగు గజల్ ||శాంతికపోతాలెపుడూ ఎగురుతూనె ఉండాలీ  
వైరులు పన్నిన వలలను తెంచుతూనె ఉండాలీ 

తెగువను చూపాలంటే చల్లదనం పనికిరాదు 
వీరుల రక్తము ఎపుడూ మరుగుతూనె ఉండాలీ 

పదికి బదులు వేయి తలలు నరికి తెచ్చి చూపాలీ 
యోధులలో పౌరుషాగ్ని రగులుతూనె ఉండాలీ  

సూచీముఖ వ్యూహంతో మున్ముందుకి సాగాలీ 
ప్రత్యర్ధుల దళాలన్ని చీల్చుతూనె ఉండాలీ 

కంచెదాటి ఒక్క అడుగు దేశంలో పడకూడదు
హద్దునుండి శత్రువులను తరుముతూనె ఉండాలీ

నిప్పులుకక్కే క్షిపణిగ ఒక్కొక్కడు మారాలీ 
యుద్ధంలో పగవారిని కూల్చుతూనె ఉండాలీ 

విజయోత్సాహం నిండిన కనులలోన "నెలరాజా"
దేశభక్తి పొంగిపొంగి పొర్లుతూనె ఉండాలీ  

2 comments:

  1. దేశభక్తిని పెంచి ఊపునిచ్చే గజల్...బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. హృదయపూర్వకమైన ధన్యవాదాలు పద్మగారు :-) #శ్రీ.

      Delete