20/02/2012

అన్వేషణనేను నిన్ను ఎప్పుడు  పోగొట్టుకున్నానో  నాకే తెలియదు ...
నీకోసం మొదలైంది నా అన్వేషణ.

పూల పరిమళాలలో వెతికాను   నీకోసం...
పున్నమి నాటి వెన్నెల్లో వెతికాను.....
ఎగసి పడే సాగర తరంగాలలో వెతికాను...
గల గల పారే సెలయేటిలో వెతికాను
అందమైన జలపాతాలలో  వెతికాను ....

ఎంత మూర్ఖుడినో చూసావా?
అన్నింటి కంటే  అందమైన  నా మదిలో..
నిన్ను వెతుక్కోలేదు  చూడు.

2 comments:

 1. great thoughts,great presentation
  and a good way for all to appreciate the quality literature
  keep going
  subrahmanyam

  ReplyDelete
  Replies
  1. thank u.for the wishes and blessings of my friends@sri

   Delete