గ్రీష్మ తాపాలకు వేడెక్కి
నింగి నుండి జారే ప్రతి చినుకుని
ఒడిసి పట్టుకోవాలనే ప్రయత్నంలో...
తలమునకలై ఉంది
ప్రకృతిలోని ప్రతి కణం...
ప్రకృతిలోని ప్రతి కణం...
రాత్రనక..పగలనక,
చేసిన తపస్సు ఫలించి
వరం పొందిన వసుంధర
పులకరించి పరవశిస్తోంది...
వేసవి వేడికి చిక్కి, శల్యమై
నెమ్మది నెమ్మదిగా సాగరుని వైపు
పయనించే నదీ నదాలు...
మేఘమిచ్చిన జలోత్సాహంతో
వడివడిగా తమ ప్రియతముని
చేరాలని వేగిర పడుతున్నాయి...
ఎందరికో సంతోషాన్నిచ్చే ఈ వర్షం...
నాకు ఎందుకు ఇష్టమో,
నిత్యం...వర్షంకోసం
ఎందుకు ఎదురు చూస్తానో
ఎందుకు ఎదురు చూస్తానో
తెలుసా నీకు?
నీకోసం
నా కనులు చిందించే
నా కనులు చిందించే
దుఃఖాశ్రువులను
పరుల కంట పడనీయక
పరుల కంట పడనీయక
తనలోనే దాచేసుకుంటుందిగా
ఈ వర్షం!... @శ్రీ
ఈ వర్షం!... @శ్రీ
శ్రీగారు...వర్షం అలా మీ కన్నీటిని పరులకంట పడనీయదేమో కానీ తననుండి దాచలేదులెండి:-) భావం బాగుందండి!
ReplyDeleteపద్మ గారూ!
Deleteమీరలా అన్నాక...
"एक दोस्त ऐसा चाहिए ..
जो आपके आसुवोंको तेज बारिश में भी पहचाना सके.."
అనే ఎపుడో చదివిన హిందీ మెసేజ్ గుర్తొచ్చింది.
ధన్యవాదాలు మీకు భావం నచ్చినందుకు...
@శ్రీ
శ్రీ గారు.. బాగుందండి వర్షం మీద కవిత..
ReplyDeleteనీలాకాశం లో కమ్ముకున్న మబ్బులు..
జోరుగా కురిసింది వాన!
మీ మనసులో కమ్ముకున్న దిగులు మబ్బులు..
ఏకదాటిగా కురిసింది కన్నీటి వాన!
వెన్నెల గారూ!
Deleteచాలా బాగున్నాయి మీరు వ్రాసిన నాలుగు లైన్లు...
ధన్యవాదాలు మీకు భావం నచ్చినందుకు...
@శ్రీ
కనబడని కన్నీటి అనుభూతి,,,
ReplyDeleteకళవళపడుతూ కరిగిపోయింది...
వెల్లువైన వాన చుక్కలతో పాటుగా,
తాను ఓ నీటి చుక్కై...
భాస్కర్ గారూ!
Deleteస్పందనతో మీరు వ్రాసింది చాలా నచ్చింది...
ధన్యవాదాలు మీ స్పందనకు...
@శ్రీ
ఎప్పటిలాగే...
ReplyDeleteఅంతేనంటావా హర్షా!...
Deleteధన్యవాదాలు మీ స్పందనకు...
@శ్రీ
శ్రీ గారూ, మంచి భావన అక్షర రూపాన కవితావర్షమై కురిసింది.
ReplyDeleteమీ కవితల్లో ఎప్పటిలాగే కొత్త ప్రయోగాలు(పదాలు) జలోత్సాహం వంటివి ఎన్నో,
మనసులోని భావానికి ముందుగా ఇచ్చిన ఉపమానాలు కవితకి చక్కటి శోభనిస్తాయి ఇది మీ కవితకున్న ప్రత్యేకత.
సర్, దుఃఖం వాననీటితో దాచేయటం కూడా ప్రయోగమే.(:-) ) చక్కటి కవిత బాగుందండీ.
మెరాజ్ గారూ!
Deleteమీరిచ్చిన ప్రశంసకి,
ప్రతికవితకూ ప్రోత్సహిస్తున్నందుకు
ధన్యవాదాలు...
గుర్తించే హృదయం ఉంటే...
వర్షంలో కూడా ఆ కన్నీటిని గుర్తిన్చేస్తుంది...
@శ్రీ
This comment has been removed by the author.
ReplyDeleteచక్కగా ఉందండి మీ వానకవిత.
ReplyDeleteధన్యవాదాలు సృజన గారూ!
Deleteమీకు కవితాభావం నచ్చినందుకు...
@శ్రీ
శ్రీ గారు!
ReplyDeleteచక్కటి భావుకత్వంతో, పదజాలంతో మీ భావవ్యక్తీకరణ చాలా బాగుందండి.
భారతి గారూ!
Deleteమీకు నచ్చిన అంశాలు నాకవితలో ఉన్నందుకు,
వాటిని మీరు మెచ్చినందుకు
ధన్యవాదాలు మీకు...
@శ్రీ
కవితబాగుందండి.
ReplyDeleteఅనికేత్ గారూ!
Deleteమీరు కవిత మెచ్చినందుకు
ధన్యవాదాలు.
@శ్రీ
This comment has been removed by the author.
ReplyDeleteHappy engineers day sir.
DeleteThank you madam for your wish...
Delete@sri
చిత్రానికి తగ్గట్టుగా భలేగా వ్రాస్తారండి మీరు.
ReplyDeleteజ్యోతి గారూ!
Deleteధన్యవాదాలు మీ ప్రశంసకి...
చిత్రం చూసి కొన్ని భావాలు వస్తాయి...
కొన్ని వ్రాసాక చిత్రం కోసం వెదుక్కుంటాను...
(ఒకోసారి కావాల్సిన చిత్రం దొరక్క అవస్థ పడుతుంటాను...:-)...)
చిత్రం చూసి వ్రాయటం ఎందుకో ఎక్కువ ఇష్టం...
(నా బ్లాగ్ లో కొన్ని అలా వ్రాసినవి.)
@
చక్కగా చెప్పారండీ భావాన్ని!
ReplyDeleteకనిపించే కన్నీళ్ళని తనలో చేర్చుకుని దాచగలిగినా
గుండెల్లో కనపడని కన్నీళ్ళ సాగరాన్ని చేరగలదా...
ఏ జల్లైనా...
ధన్యవాదాలు చిన్ని ఆశ గారూ!
ReplyDeleteమీకు కవిత లోని భావం నచ్చినందుకు...
మీరన్నది నిజమే...
ఆ సాగరాన్ని చేరాలంటే...
ఆ కన్నీటిని తుడిచే ప్రేమకి మాత్రమె సాధ్యమేమో...
@శ్రీ
వర్షం ఇచ్చే అనుభూతి అందులో తడిస్తే అర్ధమవుతుంది.పొలాల వెంట వెళ్ళినప్పుడు ఎన్నో రోజులుగా వర్షం లేక ఎండిన మట్టి విడిచిన వాసన పీలిస్తే అందులోని పరవశం అర్థమవుతుంది.పిల్ల కాలువలు కట్టి నీటిని ఆపి కాగితపు పడవలు విడిస్తే మరింత ఆనందం.మీ కవిత అన్నింటిని గుర్తుకు తెచ్చింది.
ReplyDeleteప్రేమ,వెన్నెల, వర్షం...
ReplyDeleteవీటిలో తడిస్తేనేగా...ఆనందం ...:-)
బాగా చెప్పారు రవిశేఖర్ గారూ!
ధన్యవాదాలు మీ స్నేహపూర్వకమైన స్పందనకు...
@శ్రీ