14/09/2012

తనలోనే దాచేసుకుంటుందిగా ఈ వర్షం!...


గ్రీష్మ తాపాలకు వేడెక్కి 
నింగి నుండి జారే ప్రతి చినుకుని 
ఒడిసి పట్టుకోవాలనే ప్రయత్నంలో...
తలమునకలై ఉంది
ప్రకృతిలోని ప్రతి కణం...

రాత్రనక..పగలనక,
చేసిన తపస్సు ఫలించి 
వరం పొందిన వసుంధర 
పులకరించి పరవశిస్తోంది...

వేసవి వేడికి చిక్కి, శల్యమై
నెమ్మది నెమ్మదిగా సాగరుని వైపు 
పయనించే నదీ నదాలు...
మేఘమిచ్చిన జలోత్సాహంతో
వడివడిగా తమ ప్రియతముని
చేరాలని వేగిర పడుతున్నాయి...

ఎందరికో సంతోషాన్నిచ్చే ఈ వర్షం...
నాకు ఎందుకు  ఇష్టమో,
నిత్యం...వర్షంకోసం 
ఎందుకు ఎదురు చూస్తానో
తెలుసా నీకు?


నీకోసం 
నా కనులు చిందించే 
దుఃఖాశ్రువులను 
పరుల కంట పడనీయక
తనలోనే  దాచేసుకుంటుందిగా
ఈ వర్షం!...                                         @శ్రీ 

                                                                   






26 comments:

  1. శ్రీగారు...వర్షం అలా మీ కన్నీటిని పరులకంట పడనీయదేమో కానీ తననుండి దాచలేదులెండి:-) భావం బాగుందండి!

    ReplyDelete
    Replies
    1. పద్మ గారూ!
      మీరలా అన్నాక...
      "एक दोस्त ऐसा चाहिए ..
      जो आपके आसुवोंको तेज बारिश में भी पहचाना सके.."
      అనే ఎపుడో చదివిన హిందీ మెసేజ్ గుర్తొచ్చింది.
      ధన్యవాదాలు మీకు భావం నచ్చినందుకు...
      @శ్రీ

      Delete
  2. శ్రీ గారు.. బాగుందండి వర్షం మీద కవిత..

    నీలాకాశం లో కమ్ముకున్న మబ్బులు..
    జోరుగా కురిసింది వాన!
    మీ మనసులో కమ్ముకున్న దిగులు మబ్బులు..
    ఏకదాటిగా కురిసింది కన్నీటి వాన!

    ReplyDelete
    Replies
    1. వెన్నెల గారూ!
      చాలా బాగున్నాయి మీరు వ్రాసిన నాలుగు లైన్లు...
      ధన్యవాదాలు మీకు భావం నచ్చినందుకు...
      @శ్రీ

      Delete
  3. కనబడని కన్నీటి అనుభూతి,,,
    కళవళపడుతూ కరిగిపోయింది...
    వెల్లువైన వాన చుక్కలతో పాటుగా,
    తాను ఓ నీటి చుక్కై...

    ReplyDelete
    Replies
    1. భాస్కర్ గారూ!
      స్పందనతో మీరు వ్రాసింది చాలా నచ్చింది...
      ధన్యవాదాలు మీ స్పందనకు...
      @శ్రీ

      Delete
  4. ఎప్పటిలాగే...

    ReplyDelete
    Replies
    1. అంతేనంటావా హర్షా!...
      ధన్యవాదాలు మీ స్పందనకు...
      @శ్రీ

      Delete
  5. శ్రీ గారూ, మంచి భావన అక్షర రూపాన కవితావర్షమై కురిసింది.
    మీ కవితల్లో ఎప్పటిలాగే కొత్త ప్రయోగాలు(పదాలు) జలోత్సాహం వంటివి ఎన్నో,
    మనసులోని భావానికి ముందుగా ఇచ్చిన ఉపమానాలు కవితకి చక్కటి శోభనిస్తాయి ఇది మీ కవితకున్న ప్రత్యేకత.
    సర్, దుఃఖం వాననీటితో దాచేయటం కూడా ప్రయోగమే.(:-) ) చక్కటి కవిత బాగుందండీ.

    ReplyDelete
    Replies
    1. మెరాజ్ గారూ!
      మీరిచ్చిన ప్రశంసకి,
      ప్రతికవితకూ ప్రోత్సహిస్తున్నందుకు
      ధన్యవాదాలు...
      గుర్తించే హృదయం ఉంటే...
      వర్షంలో కూడా ఆ కన్నీటిని గుర్తిన్చేస్తుంది...
      @శ్రీ

      Delete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. చక్కగా ఉందండి మీ వానకవిత.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సృజన గారూ!
      మీకు కవితాభావం నచ్చినందుకు...
      @శ్రీ

      Delete
  8. శ్రీ గారు!
    చక్కటి భావుకత్వంతో, పదజాలంతో మీ భావవ్యక్తీకరణ చాలా బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. భారతి గారూ!
      మీకు నచ్చిన అంశాలు నాకవితలో ఉన్నందుకు,
      వాటిని మీరు మెచ్చినందుకు
      ధన్యవాదాలు మీకు...
      @శ్రీ

      Delete
  9. Replies
    1. అనికేత్ గారూ!
      మీరు కవిత మెచ్చినందుకు
      ధన్యవాదాలు.
      @శ్రీ

      Delete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. చిత్రానికి తగ్గట్టుగా భలేగా వ్రాస్తారండి మీరు.

    ReplyDelete
    Replies
    1. జ్యోతి గారూ!
      ధన్యవాదాలు మీ ప్రశంసకి...
      చిత్రం చూసి కొన్ని భావాలు వస్తాయి...
      కొన్ని వ్రాసాక చిత్రం కోసం వెదుక్కుంటాను...
      (ఒకోసారి కావాల్సిన చిత్రం దొరక్క అవస్థ పడుతుంటాను...:-)...)
      చిత్రం చూసి వ్రాయటం ఎందుకో ఎక్కువ ఇష్టం...
      (నా బ్లాగ్ లో కొన్ని అలా వ్రాసినవి.)
      @

      Delete
  12. చక్కగా చెప్పారండీ భావాన్ని!
    కనిపించే కన్నీళ్ళని తనలో చేర్చుకుని దాచగలిగినా
    గుండెల్లో కనపడని కన్నీళ్ళ సాగరాన్ని చేరగలదా...
    ఏ జల్లైనా...

    ReplyDelete
  13. ధన్యవాదాలు చిన్ని ఆశ గారూ!
    మీకు కవిత లోని భావం నచ్చినందుకు...
    మీరన్నది నిజమే...
    ఆ సాగరాన్ని చేరాలంటే...
    ఆ కన్నీటిని తుడిచే ప్రేమకి మాత్రమె సాధ్యమేమో...
    @శ్రీ

    ReplyDelete
  14. వర్షం ఇచ్చే అనుభూతి అందులో తడిస్తే అర్ధమవుతుంది.పొలాల వెంట వెళ్ళినప్పుడు ఎన్నో రోజులుగా వర్షం లేక ఎండిన మట్టి విడిచిన వాసన పీలిస్తే అందులోని పరవశం అర్థమవుతుంది.పిల్ల కాలువలు కట్టి నీటిని ఆపి కాగితపు పడవలు విడిస్తే మరింత ఆనందం.మీ కవిత అన్నింటిని గుర్తుకు తెచ్చింది.

    ReplyDelete
  15. ప్రేమ,వెన్నెల, వర్షం...
    వీటిలో తడిస్తేనేగా...ఆనందం ...:-)
    బాగా చెప్పారు రవిశేఖర్ గారూ!
    ధన్యవాదాలు మీ స్నేహపూర్వకమైన స్పందనకు...
    @శ్రీ

    ReplyDelete