21/07/2014

|| కవిత్వమంటే ||


|| కవిత్వమంటే || 

పట్టెడు అక్షరాల్లో 
పుట్టెడు భావాలు గుప్పించడమే.

అక్షరాలకి
అందమైన భావాల రంగులు పూయడమే.

అక్షర(య)గనుల్లో
భావాల మణులను వెలికితీయడమే.

అక్షరఖడ్గాలతో
భావప్రహారాలు చేయడమే.

అక్షరాణువులతో
భావవిస్ఫోటనం చేయడమే.

అక్షరలక్షలతో
భావాలను అమూల్యం చేయడమే.

అక్షరసుమాలతో
భవ్యమైన భావమాలికలు అల్లడమే.

అక్షరవిత్తులతో
భావాలసేద్యం చేయడమే.

అక్షరకపోతాలకు
భావవ్యక్తీకరణలో స్వేచ్చను నేర్పించడమే.

అక్షరాలతో అలవోకగా ఆడుకోవడమే
పదాలతో పదనిసలు పలికించడమే
అక్షరాల ఇటుకలతో భవ్యమైన భావసౌధాలు నిర్మించడమే...@శ్రీ

2 comments:

  1. చాలాబాగాచెప్పారు కవిత్వం అంటే ఏంటో

    ReplyDelete
  2. అక్షయ గనులలోని పుట్టెడు అక్షరాలనూ వెలికితీసి మీ భావాల రంగులను విరజిమ్మేలా సాన పట్టి, భావ విస్ఫోటనమే కాదు...
    అక్షర విత్తులను జల్లి సేద్యం చేసి శాంతి కపోతాలకు స్వేచ్చా నెలవును చేసి,
    మనసునాటలాడేలా చేసి, హాయిని గొల్పు మీ అక్షరం...ప్రతీకణాన్నీ స్పృశిస్తూ....మీకు వందనం.

    ReplyDelete