21/07/2014

||కన్నుల్లో... నీ రూపమే ||
నా కనుపాపల్లో దాగిన నీ సౌందర్యం 
మబ్బుల మాటు వెన్నెలరేని చందం.

రెప్పల చాటున దాగిన నీరూపం 
వెన్నెల్లో సైతం తళుకులీనే తారాదీపం.

కన్నుల్లో నీరూపం చేసే నృత్యాలు
చీకటి యవనికపై సిరివెన్నెల లాస్యాలు.

గుప్పెట్లో దాగని రవికిరణంలా
రెప్పలపై కూడా కనిపించే నీ సమ్మోహన రూపం

నిను నే కోరే వరం
నా కంటిలో నీ శాశ్వత నివాసం...@శ్రీ 

1 comment:

  1. "నిను నే కోరే వరం
    నా కంటిలో నీ శాశ్వత నివాసం.."
    ఇంతకన్నా ఇంకేముంటుంది అపురూపమైన 'వరం'?

    ReplyDelete